విశాఖ వన్డే : కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్
విశాఖ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. 33వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ వరుస బంతుల్లో మూడు

విశాఖ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. 33వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ వరుస బంతుల్లో మూడు
విశాఖ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. 33వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ వరుస బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. 33వ ఓవర్ 4వ బంతికి హోప్(78) ను ఔట్ చేశాడు. కోహ్లీ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. 5వ బంతికి హోల్డర్(11)ను ఔట్ చేశాడు. కీపర్ క్యాచ్ అందుకున్నాడు. 6వ బంతికి జోసఫ్(0) ను ఔట్ చేశాడు. బ్యాట్ చివరలో బంతి తాకి స్లిప్‌లో ఉన్న జాదవ్ చేతిలో పడింది. దీంతో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ కొట్టాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో రెండుసార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్‌గా కుల్దీప్ యాదవ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 2017లో కోల్‌కతాలో ఆసీస్‌తో జరిగిన వన్డేలో కుల్దీప్ ఫస్ట్ టైమ్ హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు చేతన్ శర్మ (1987 నాగపూర్ – న్యూజిలాండ్ పై), కపిల్ దేవ్ (1991 కలకత్తా – శ్రీలంక పై), కుల్దీప్ యాదవ్ (2017 కలకత్తా – ఆస్ట్రేలియా పై), మహ్మద్ షమీ (2019 సౌతాంప్టన్ – ఆప్ఘనిస్తాన్ పై) హ్యాట్రిక్ వికెట్లు సాధించారు.
చేతన్ శర్మ, కపిల్ దేవ్, షమీ ఒకసారి మాత్రమే హ్యాట్రిక్‌లు సాధిస్తే.. కుల్దీప్ యాదవ్ మాత్రం రెండుసార్లు సాధించడం విశేషం. ఇలా ఒకటికంటే ఎక్కువ సార్లు హ్యాట్రిక్‌లు సాధించిన వారిలో మలింగా(3సార్లు) తొలి స్థానంలో ఉన్నాడు. రెండు సార్లు హ్యాట్రిక్‌లు సాధించిన వారిలో వసీం అక్రమ్, సక్లయిన్ ముస్తాక్, చమిందా వాస్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ యాదవ్‌లు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.
కాగా, విండీస్‌తో రెండో వన్డేలో మహ్మద్ షమీకి హ్యాట్రిక్ తీసే అవకాశం జస్ట్ లో మిస్ అయ్యింది. 30 ఓవర్ రెండో బంతికి పూరన్‌ను ఔట్ చేసిన షమీ.. ఆ ఓవర్ మూడో బంతికి పొలార్డ్‌ను గోల్డెన్ డక్‌గా ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన హోల్డర్ హ్యాట్రిక్ అవకాశాన్ని అడ్డుకున్నాడు.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ శతకాలతో చెలరేగారు. విండీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. 50 ఓవర్లలో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది.