IND vs SA: జైస్వాల్, కోహ్లీ, రోహిత్ ముగ్గురూ కాదు.. ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఇతడే.. Video
ఇందుకు సంబంధించిన మెడల్‌ను అతడికి డ్రెస్సింగ్ రూమ్‌లో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటె అందించాడు.
Pic: @BCCI
Kuldeep Yadav: సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా 9 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత టీమ్ఇండియా ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ అందుకున్నాడు.
ఇందుకు సంబంధించిన మెడల్‌ను అతడికి డ్రెస్సింగ్ రూమ్‌లో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటె అందించాడు. ఈ వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో కుల్‌దీప్ యాదవ్ మొత్తం 9 వికెట్లు తీశాడు. మూడు మ్యాచుల్లో అతడి సగటు 20.77గా ఉంది. బ్యాటర్లు ఆధిపత్యం సాధించిన ఈ సిరీస్‌లో కుల్‌దీప్ యాదవ్ ఈ అవార్డు అందుకోవడం విశేషం.
Also Read: దేశంలో ఈ వస్తువుల ధరలు తగ్గిపోనున్నాయోచ్..! నిత్యావసరాల ధరలు కూడా..
కాగా, భారత స్పిన్ మాస్ట్రో కుల్దీప్ యాదవ్ విశాఖపట్నంలో ముగిసిన మూడు మ్యాచ్‌ల దక్షిణాఫ్రికా వన్‌డే సిరీస్‌లో అన్‌సంగ్ హీరోగా నిలిచాడు. దక్షిణాఫ్రికాపై సిరీస్ సైలెంట్ గేమ్ చేంజర్‌గా నిలిచాడు. సిరీస్ మొదటి వన్‌డే నుంచే కుల్దీప్ ప్రభావం స్పష్టంగా కనపడింది.
రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో 4 వికెట్లు తీసి భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. మూడో వన్‌డేలో కుల్దీప్ పీక్ పర్ఫార్మన్స్ ఇచ్చాడు. క్వింటన్ డి కాక్ సెంచరీ తర్వాత దక్షిణాఫ్రికా భారీ స్కోర్ దిశగా సాగుతున్న వేళ, డేవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సన్, కార్బిన్ బోష్ వేగం పెంచేందుకు సిద్ధంగా ఉండగా కుల్దీప్ ప్లాన్ మార్చాడు.
ఈ ముగ్గురినీ తక్కువ స్కోర్‌కే ఔట్ చేసి, 10 ఓవర్లలో 4 వికెట్లు తీసి 41 రన్స్ మాత్రమే ఇచ్చాడు. దక్షిణాఫ్రికా 350కి పైగా స్కోరు చేస్తుందని మొదట అందరూ భావించారు. కుల్‌దీప్ బౌలింగ్ దెబ్బకు ఆ జట్టు 270 పరుగులకే పరిమితం అయింది.
🗣️🗣️ In a series where the bat dominated, he showed his class with the ball 👌
Presenting the 𝐈𝐦𝐩𝐚𝐜𝐭 𝐏𝐥𝐚𝐲𝐞𝐫 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐒𝐞𝐫𝐢𝐞𝐬 – 𝙆𝙪𝙡𝙙𝙚𝙚𝙥 𝙔𝙖𝙙𝙖𝙫 🏅
🔽 Watch | #TeamIndia | #INDvSA | @imkuldeep18 | @IDFCFIRSTBank https://t.co/UiT35NFZsN
— BCCI (@BCCI) December 7, 2025
