ఐపీఎల్ 12లో బెంగళూరు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లో బెంగళూరుకు 174 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా దిగిన క్రిస్ గేల్ అనూహ్యంగా (99; 64 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సులు)తో మెరిపించాడు. ఆ ఒక్కడిని మినహాయించి ఏ ప్లేయర్ 20 పరుగులు కూడా చేయలేకపోయారు.
కెప్టెన్ కేఎల్ రాహుల్ (15), మయాంక్ అగర్వాల్(15), సర్ఫరాజ్ ఖాన్(15), శామ్ కరన్(1), మన్దీప్ సింగ్(18)పరుగులు చేయడంతో పంజాబ్ 4 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్.. మొయిన్ అలీ చెరో వికెట్ తీయగా, చాహల్ 2వికెట్లు పడగొట్టాడు.