KXIPvRCB: హమ్మయ్య.. బెంగళూరు బోణీ కొట్టింది

ఎట్టకేలకు ఈ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. కీలకమైన మ్యాచ్ లో గెలవాలనే పట్టుదలతో కనిపించిన కోహ్లీసేన సక్సెస్ అయింది.

ఎట్టకేలకు ఈ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. కీలకమైన మ్యాచ్ లో గెలవాలనే పట్టుదలతో కనిపించిన కోహ్లీసేన సక్సెస్ అయింది.

ఎట్టకేలకు ఈ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. కీలకమైన మ్యాచ్ లో గెలవాలనే పట్టుదలతో కనిపించిన కోహ్లీసేన సక్సెస్ అయింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై పంజాబ్ వేదికగా 8వికెట్ల తేడాతో గెలుపొందింది. కోహ్లీ.. డివిలియర్స్ తో పాటు స్టోనిస్ తోడవడంతో చేధనలో విజయం చేజిక్కించుకుంది.

174 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన బెంగళూరు ఆరంభం నుంచి దూకుడైన ఆటతీరు కనబరిచింది. ఈ క్రమంలో పార్థివ్ పటేల్(19; 9 బంతుల్లో 4 ఫోర్లు), విరాట్ కోహ్లీ(67; 53 బంతుల్లో 8 ఫోర్లు), డివిలియర్స్(59; 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులు), మార్సస్ స్టోనిస్(28; 16బంతుల్లో 4 ఫోర్లు)తో అద్భుతమైన ఆటకనబరిచారు. 

పార్థివ్ పటేల్ అశ్విన్ బౌలింగ్ లో మయాంక్ కు క్యాచ్ ఇచ్చి.. 43 పరుగుల వద్ద పెవిలియన్ చేరగా, విరాట్ కోహ్లీ షమీ బౌలింగ్ లో ఎమ్ అశ్విన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

అంతకంటే ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ బ్యాట్స్ మెన్ 174 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఓపెనర్ గా దిగిన క్రిస్ గేల్ అనూహ్యంగా (99; 64 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సులు)తో మెరిపించాడు. ఆ ఒక్కడిని మినహాయించి ఏ ప్లేయర్ 20 పరుగులు కూడా చేయలేకపోయారు.

కెప్టెన్ కేఎల్ రాహుల్ (15), మయాంక్ అగర్వాల్(15), సర్ఫరాజ్ ఖాన్(15), శామ్ కరన్(1), మన్దీప్ సింగ్(18)పరుగులు చేయడంతో పంజాబ్ 4 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్.. మొయిన్ అలీ చెరో వికెట్ తీయగా, చాహల్ 2వికెట్లు పడగొట్టాడు.