KXIPvsDC: ఢిల్లీ టార్గెట్ 164

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పోరాడింది. 163 పరుగులు చేసేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేవరకూ 7 వికెట్లు నష్టపోయింది. ఓపెనర్లుగా దిగిన కేఎల్ రాహుల్(12), క్రిస్ గేల్(69; 37బంతుల్లో 6ఫోర్లు, 5 సిక్సులు) చేసి జట్టు స్కోరు పరుగులు పెట్టించారు. 

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన మయాంక్ అగర్వాల్(2), డేవిడ్ మిల్లర్(7), మన్దీప్ సింగ్(30), శామ్ కరన్(0), రవిచంద్రన్ అశ్విన్(16), హర్పీత్ బ్రార్(20), విల్జియోన్(2)పరుగులు చేయగలిగారు.