KXIPvsDC: ఢిల్లీ టార్గెట్ 167

ఐపిఎల్ లో భాగంగా పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరుగుతున్న పోరులో పంజాబ్ ను ఢిల్లీ కట్టడి చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయ గలిగింది. ఇన్నింగ్స్ ను ఓపెనర్లు పేలవంగా ఆరంభించడమే ప్రధాన కారణం. ఈ రాహుల్ (15),శ్యామ్ కర్రన్ (20)లు,అగర్వాల్ (6) కుదేలవడంతో టాప్ఆర్డర్ కుప్పకూలింది.

 

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సర్ఫరాజ్ ఖాన్(39), పరుగులు చేసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. అతనికి డేవిడ్ మిల్లర్(43) తోడవడంతో పంజాబ్ ఓ మాదిరి స్కోరు చేయ గలిగింది. ఇన్నింగ్స్ ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన విల్జియొన్ (1),మన్ దీప్ సింగ్ (29),రవిచంద్రన్ అశ్విన్ (1), మహమ్మద్..షమీ(0), ముజీబుర్ రెహమాన్(0) పరుగులకే పరిమితమయ్యాడు. 

ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరిస్(3), లామిచనె(2), రబాడ(2) వికెట్లు తీయగలిగారు. గత మ్యాచ్‌లో అద్భుతంగా చేధన చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి సత్తా చాటితే పంజాబ్ పై సునాయస విజయాన్ని అందుకోవచ్చు.