ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతోన్న పోరులో పంజాబ్ విజృంభించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ముంబైకు 198 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. పంజాబ్ ఇన్నింగ్స్ ను ఓపెనర్లు కేఎల్ రాహుల్(100; 64 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులు), క్రిస్ గేల్(63; 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులు) అద్భుతంగా రాణించారు.
ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన డేవిడ్ మిల్లర్(7), కరుణ్ నాయర్(5), శామ్ కరన్(8), మన్దీప్ సింగ్(7)లు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి పరవాలేదనిపించే స్కోరుతో ఇన్నింగ్స్ ముగించారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా, జాసన్ బహ్రెండార్ఫ్, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు.