KXIPvsRR: మరోసారి రాజీపడ్డ రాజస్థాన్

పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ పై విరుచుకుపడ్డారు. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ రాజస్థాన్ ను చిత్తు చేసి 12 పరుగుల తేడాతో విజయం సాధించారు.    టాస్ ఓడినా పంజాబ్ ప్లేయర్లు భేష్ అనిపించే ప్రదర్శన చేసి కట్టిపడేశారు. బౌలింగ్ ప్రధాన బలం కావడంతో మరోసారి తమ అస్త్రాన్ని సంధించి రాజస్థాన్ ను మట్టి కరిపించారు. ఒకానొక దశలో వస్తుందనుకున్న విజయం అట్టే చేజారడంతో రాజస్థాన్ కు నిరుత్సాహం తప్పలేదు. 

183 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్థాన్ శుభారంభమే ఇచ్చినా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ప్లేయర్లు పేలవంగా తప్పుకున్నారు. రాహుల్ త్రిపాఠీ(50), జోస్ బట్లర్(23), సంజూ శాంసన్(27), అజింకా రహానె(26), స్టువర్ట్ బిన్నీ(33)లు పరవాలేదనిపించే స్కోరు నమోదు చేశారు. 

ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన ఆష్టన్ టర్నర్(0), జోఫ్రా ఆర్చర్(1), శ్రేయాస్ గోపాల్(0), జయదేవ్ ఉన్దక్త్(0)పరుగులకే పరిమితమైయ్యారు. పంజాబ్ బౌలర్లలో అక్షదీప్ సింగ్, రవీచంద్రన్ అశ్విన్, మొహమ్మద్ షమీ తలో 2 వికెట్లు తీయగా మురుగన్ అశ్విన్ చేతికి ఒక్క వికెట్ దక్కింది. 

అంతకంటే ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ఆటగాళ్లు.. రాజస్థాన్ కు 183 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (52), క్రిస్ గేల్(30)పరుగులు చేయగా, మయాంక్ అగర్వాల్(26), డేవిడ్ మిల్లర్(40) తో సరిపెట్టుకున్నారు. 

ఆఖరి 2 ఓవర్లలో తడబడిన పంజాబ్ 3 వికెట్లు కోల్పోయింది. నికోలస్ పూరన్(5), మన్దీప్ సింగ్(0), రవిచంద్రన్ అశ్విన్(17), ముజీబ్ ఉర్ రెహ్మాన్(0)పరుగులతో ముగించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ ఒక్కడే 3వికెట్లు తీయగా, ధావల్ కుల్కర్ణి, జయదేవ్, ఇష్ సౌదీ తలో వికెట్ పడగొట్టారు.