West Indies : గెలుపు జోష్‌లో ఉన్న వెస్టిండీస్‌కు భారీ షాక్‌.. కీల‌క‌మైన‌ ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందే ఇలా జ‌ర‌గాలా..!

అమెరికా పై తొమ్మిది వికెట్ల తేడాతో విజ‌యం సాధించి గెలుపు జోష్‌లో ఉన్న వెస్టిండీస్‌కు షాక్ త‌గిలింది.

West Indies : గెలుపు జోష్‌లో ఉన్న వెస్టిండీస్‌కు భారీ షాక్‌.. కీల‌క‌మైన‌ ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందే ఇలా జ‌ర‌గాలా..!

Kyle Mayers to join West Indies squad as replacement for injured Brandon King

West Indies – Kyle Mayers : అమెరికా పై తొమ్మిది వికెట్ల తేడాతో విజ‌యం సాధించి గెలుపు జోష్‌లో ఉన్న వెస్టిండీస్‌కు షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు బ్రాండ‌న్ కింగ్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లోని మిగిలిన మ్యాచ్‌ల‌కు దూరం అయ్యాడు. ఈ విష‌యాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలియ‌జేసింది.

సూప‌ర్‌లో 8 భాగంగా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బ్రాండ‌న్ కింగ్ గాయ‌ప‌డ్డాడు. బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో అత‌డికి గాయ‌మైంది. దీంతో అత‌డు రిటైర్డ్ హార్ట్‌గా మైదానాన్ని వీడాడు. ఆ మ్యాచ్‌లో మ‌ళ్లీ మైదానంలో అడుగుపెట్ట‌లేదు. అమెరికాతో మ్యాచ్‌లో కూడా ఆడ‌లేదు. కాగా.. అత‌డికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. సైడ్ స్ట్రెయిన్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలిసింది. అత‌డి కొన్ని రోజులు విశ్రాంతి అవ‌స‌రం అని వైద్యులు సూచించారు.

Ravi Shastri : ర‌విశాస్త్రి పోస్ట్ వైర‌ల్‌.. ఇదేం డ్రెస్ రా బాబు అని అంటున్న నెటిజ‌న్లు..

దీంతో అత‌డు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లోని మిగిలిన మ్యాచ్‌ల‌కు దూరం అయ్యాడు. అత‌డి స్థానంలో కైల్ మేయ‌ర్స్‌ను తీసుకుంటున్న‌ట్లు వెస్టిండీస్ ప్ర‌క‌టించింది. ఇందుకు ఐసీసీ అనుమ‌తి ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించింది. ఇక వెస్టిండీస్ త‌న త‌దుప‌రి మ్యాచ్‌ను ద‌క్షిణాఫ్రికాతో ఆడ‌నుంది. సెమీ ఫైన‌ల్‌కు వెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో విండీస్ ఖ‌చ్చితంగా విజ‌యం సాధించాల్సి ఉంది. ఇంత కీల‌క‌మైన మ్యాచ్ కు బ్రాండ‌న్ కింగ్ దూరం కావ‌డం వెస్టిండీస్‌కు పెద్ద షాక్‌గానే చెప్ప‌వ‌చ్చు.

ఇక దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ ఓడిపోతే అప్పుడు ఇంగ్లాండ్ సెమీ ఫైన‌ల్‌కు చేరే అవ‌కాశాలు పెరుగుతాయి. అప్పుడు ఇంగ్లాండ్ త‌న ఆఖ‌రి మ్యాచ్‌లో గెలిస్తే చాలు ఎలాంటి స‌మీక‌ర‌ణాలు లేకుండా సెమీఫైన‌ల్‌కు వెళ్లొచ్చు. ఒక‌వేళ వెస్టిండీస్ గ‌నుక ద‌క్షిణాఫ్రికాను ఓడిస్తే.. సెమీఫైన‌ల్ రేసు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది.

Virat Kohli : కోహ్లి బ్యాటింగ్ పై కోచ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. విరాట్ ప‌రుగులు చేసినా ఆనందంగా లేదు..