వచ్చాడు.. వెళుతున్నాడు: మలింగకు ఐపీఎల్ నుంచి బ్రేక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైనప్పటి నుంచి ముంబై ఇండియన్స్ తరపున ఆడాల్సి ఉన్న లసిత్ మలింగ తొలి మ్యాచ్‌కు దూరంగానే ఉన్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైనప్పటి నుంచి ముంబై ఇండియన్స్ తరపున ఆడాల్సి ఉన్న లసిత్ మలింగ తొలి మ్యాచ్‌కు దూరంగానే ఉన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైనప్పటి నుంచి ముంబై ఇండియన్స్ తరపున ఆడాల్సి ఉన్న లసిత్ మలింగ తొలి మ్యాచ్‌కు దూరంగానే ఉన్నాడు. ఫలితంగా తొలి మ్యాచ్‌లో ముంబైకి పరాభవం తప్పలేదు. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో మలింగ్ అందుబాటులోకి రావడంతో జట్టు విజయం సాధించింది. బీసీసీఐ ఒత్తిడి తెచ్చిన మేరకే లంక క్రికెట్ బోర్డు మలింగను ఐపీఎల్ లో ఆడుకొమ్మని అనుమతినిచ్చింది.
Read Also : వయస్సు దాచే ప్లేయర్లను నిషేదించాల్సిందే..!!
ఆ తర్వాతి 2 మ్యాచ్‌లు ఆడిన మలింగ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడాల్సి ఉన్న మూడో మ్యాచ్ తర్వాత మళ్లీ దూరం కానున్నాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహిస్తోన్న వన్డే టోర్నమెంట్ టోర్నీలో పాల్గొనాల్సి ఉండడంతో ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 11వరకూ అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని లంక చీఫ్ సెలక్టర్ ఆసంతా దె మెల్ స్పష్టం చేశారు.
‘లంక క్రికెట్ బోర్డు ఐపీఎల్ సీజన్ మొత్తం ఆడుకొమ్మని లసిత్ మలింగ్ అనుమతినిచ్చింది. కానీ, వరల్డ్ కప్ కు జట్టు ఎంపికలో భాగంగా జరగుతున్న టోర్నీ కారణంగా మలింగ కచ్చితంగా హాజరుకావాల్సి ఉంది. ఏప్రిల్ 4నుంచి లంక క్రికెట్‌తో కలుస్తాడు’ అని లంక జట్టు చీఫ్ సెలక్టర్ తెలిపాడు.
Read Also : IPL 2019: రికార్డుకు 63 పరుగుల దూరంలో కోహ్లీ