Mohammed Siraj Net Worth : భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ఆస్తుల గురించి తెలిస్తే మైండ్ బ్లాక్.. శాలరీ ఎంత, ఏయే బ్రాండ్లు డీల్ చేస్తున్నాడు..
పేద కుటుంబం నుంచి వచ్చిన సిరాజ్ తక్కువ సమయంలోనే మంచి బౌలర్ గా గుర్తింపు పొందాడు. అంతేకాదు.. సంపాదనలోనూ దూసుకుపోతున్నాడు.

Mohammed Siraj Net Worth : టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ సిరాజ్ ఆస్తుల గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి ఆస్తుల గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. బీసీసీఐ, ఐపీఎల్ లో సిరాజ్ కు ఇచ్చే శాలరీ ఎంత, ఏయే బ్రాండ్లు డీల్ చేస్తున్నాడు అనే ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం..
హైదరాబాద్ కు చెందిన సిరాజ్ ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చాడు. ఓ ఆటో డ్రైవర్ కొడుకు. అయితే, తక్కువ సమయంలోనే మంచి బౌలర్ గా గుర్తింపు పొందాడు. అంతేకాదు.. ఈ హైదరాబాద్ గల్లీ క్రికెటర్ సంపాదనలోనూ దుమ్మురేపుతున్నాడు. తక్కువ సమయంలోనే బాగానే ఆస్తులు సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు సిరాజ్ ఎంత సంపాదించాడో తెలుసుకుందాం.
మహహ్మద్ సిరాజ్ నటి మహిరా శర్మతో డేటింగ్ లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అతడి ఆస్తుల విలువ 57 కోట్లుగా తెలుస్తోంది. అతడి గర్ల్ ఫ్రెండ్ గా చెబుతున్న మహిరా శర్మ ఆస్తుల విలువ 62 కోట్లుగా తెలుస్తోంది.
సిరాజ్ కు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఫిలిం నగర్ లో ఓ బంగ్లా ఉంది. ఆ బంగ్లా విలువ 13 కోట్లుగా తెలుస్తోంది.
ఐపీఎల్ 18వ సీజన్ లో సిరాజ్ గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్నాడు. వేలంలో సిరాజ్ ను 12.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో గ్రేడ్ ఏ ప్లేయర్ గా ఉన్నాడు. అతడికి ఏడాదికి 5 కోట్ల రూపాయల శాలరీ వస్తుంది.
Also Read : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇలా అయిపోయిందేంటి? ఇక ఇలా చేస్తేనే ప్లే ఆఫ్స్ చేరే ఛాన్స్..
పలు టాప్ బ్రాండ్స్ కు సిరాజ్ అంబాసిడర్ గా ఉన్నాడు. MyCircle11, Be O Man, CoinSwitchKuber, Crash on the Run, MyFitness, SG, ThumsUp వంటి టాప్ బ్రాండ్స్ తో ఒప్పందాలు చేసుకున్నాడు.
లగ్జరీ కార్లు అంటే సిరాజ్ కు చాలా ఇష్టం. అతడి దగ్గర ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. Range Rover Vogue, BMW 5 series, Mercedes Benz S Class and Toyota Fortuner వంటి లగ్జకీ కార్లు సిరాజ్ కొనుగోలు చేశాడు.
సిరాజ్ తండ్రి మహమ్మద్ గౌస్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించారు. అటువంటి పేద కుటుంబం నుంచి వచ్చిన సిరాజ్.. ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు. క్రికెటర్ గా బాగానే సంపాదిస్తున్నాడు. విలాసవంతమైన ఇల్లు, కార్లు కొన్నాడు. తన టాలెంట్ తో జట్టులో చోటు సంపాదించుకున్న సిరాజ్.. తనకంటూ ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. కృషి, పట్టుదల, సాధన ఉంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పడానికి సిరాజ్ నిదర్శనం. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవాలనుకున్న యువతకు సిరాజ్ ఆదర్శంగా నిలిచాడు.