SRH ప్లే ఆఫ్స్ కి చేరాలంటే ఇదిగో ఈ అద్బుతం జరగాలి..
సాధారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఫామ్‌లో ఉంటే వారి బ్యాటింగ్ విధ్వంసాన్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు.

Pic: @SunRisers (X)
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచులోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. సన్‌రైజర్స్‌కి ఇది వరుసగా ఎదురైన నాలుగో ఓటమి.
దీంతో పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చిట్టచివరి స్థానంలోనే కొనసాగుతోంది. ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒకే ఒక్క మ్యాచులో గెలిచి నాలుగు మ్యాచులో ఓడిపోయింది.
పాయింట్ల పట్టిక 2 పాయింట్లతో -1.629 నెట్‌రన్ రేట్‌తో చివరిస్థానంలో ఉంది. సాధారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఫామ్‌లో ఉంటే వారి బ్యాటింగ్ విధ్వంసాన్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. ఐపీఎల్ 2025 తొలి మ్యాచులో రికార్డు స్థాయి స్కోరు చేసినప్పటికీ, ఆ తర్వాతి అన్ని మ్యాచుల్లోనూ బ్యాటర్లు తేలిపోయారు.
ప్లే ఆఫ్స్ చేరాలంటే?
లీగ్ దశలో ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం 5 మ్యాచులు ఆడగా ఆ జట్టు ఇంకా 9 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇక ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇకపై జరగనున్న వాటిల్లో 8 మ్యాచుల్లో గెలవాలి.
ఇలా 8 మ్యాచులు గెలిస్తే ఆ జట్టు సాధించిన విజయాలు మొత్తం 9కి చేరుతాయి. దీంతో పాయింట్ల పట్టికలో 18 పాయింట్లకు ఎగబాకుతుంది. ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించునే అవకాశం ఉంటుంది.
ఇక ఆ జట్టు ఆడాల్సిన 9 మ్యాచుల్లో 2 మ్యాచ్‌లు ఓడినా ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతాయి. ఆ సమయంలో ఇతర జట్ల రిజల్ట్స్‌పై ఆధారపడాల్సి వస్తుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్ రన్‌రేట్ చాలా తక్కువగా (-1.629) ఉండడంతో తదుపరి మ్యాచుల్లో దీన్ని కూడా పెంచుకోవాల్సి ఉంటుంది.