బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడింది. టాస్ పడిన తర్వాత ఊపందుకున్న వర్షం గంటసేపు జోరుగా కురవడంతో కాసేపటి వరకూ ఆపేశారు. స్టేడియంకు వచ్చిన అభిమానులు మ్యాచ్ కోసం ఎదురుచూస్తూ గడిపారు.
టాస్ వేసే సమయంలో వాతావరణం అనుకూలిస్తుందని భావించిన కెప్టెన్లు దానికి తగ్గట్లు జట్టు ఎంపిక చేశారు. మ్యాచ్‌పై వర్షం ప్రభావం కచ్చితంగా కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. లీగ్ పట్టికలో ఆఖరి నుంచి వరుసగా రెండు స్థానాల్లో ఉన్న జట్లు కావడంతో ఇద్దరిలో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠత నెలకొంది. లీగ్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకూ 12 మ్యాచ్‌లు ఆడగా రాజస్థాన్ 5, బెంగళూరు 4విజయాలు నమోదుచేశాయి.
?️?️?️#RCBvRR pic.twitter.com/ksHkwk6cQW
— IndianPremierLeague (@IPL) April 30, 2019