Rohit Sharma: రోహిత్ రెస్ట్ తీసుకో అన్న గవాస్కర్.. అన్ని మ్యాచ్‌లు ఆడతాడన్న ముంబై కోచ్ బౌచర్..!
Rohit Sharma:కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఐపీఎల్‌లో తగినంత విశ్రాంతి తీసుకోవాలని భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) సూచించాడు. గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మార్క్ బౌచర్(Mark Boucher ) స్పందించాడు.

MI Coach Mark Boucher Reacts To Sunil Gavaskar comments
Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్ ముగిసిన వెంటనే టీమ్ఇండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ( WTC Final ) ఆడనుంది. లండన్‌లోని ఓవల్‌లో జూన్ 7 నుంచి 11 వరకు జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఐపీఎల్‌లో తగినంత విశ్రాంతి తీసుకోవాలని భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) సూచించాడు. గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మార్క్ బౌచర్(Mark Boucher ) స్పందించాడు.
రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవాలని తాను అనుకోవడం లేదని మార్క్ బౌచర్ అన్నాడు. అయితే అది తనకు సంబంధించిన విషయం కాదని, అయినప్పటికీ తాను మాత్రం రోహిత్ ఐపీఎల్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడాలని ఎల్లప్పుడూ కోరుకుంటానని చెప్పాడు. రోహిత్ టాప్ ప్లేయర్ మాత్రమే కాదు అతడు ఓ కెప్టెన్ కూడా. ఒకవేళ రోహిత్ గనుక తాను విశ్రాంతి తీసుకోవాలని అనుకుని ఆ విషయాన్ని మాకు చెబితే మాత్రం తప్పకుండా ఆ విషయాన్ని పరిశీలిస్తాం. తగిన నిర్ణయం తీసుకుంటామని మార్క్ బౌచర్ చెప్పాడు. అయితే.. ఇప్పటి వరకు రోహిత్ శర్మ తనకు విశ్రాంతి కావాలని అడగలేదు. కాబట్టి హిట్‌మ్యాన్ అన్ని మ్యాచులు ఆడుతాడని భావిస్తున్నట్లు బౌచర్ అన్నాడు.
IPL 2023: రోహిత్.. ఐపీఎల్ నుంచి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకో
డెత్ బౌలింగ్ సమస్యపై
ముంబై జట్టుకు డెత్ ఓవర్ల సమస్య వెంటాడుతోంది. చివరి ఓవర్లలో ఆ జట్టు బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తున్నారు. పంజాబ్ కింగ్స్ చివరి ఐదు ఓవర్లలో 96 పరుగులు, గుజరాత్ టైటాన్స్ ఆఖరి నాలుగు ఓవర్లలో 70 పరుగులు చేయడం ముంబై బౌలింగ్ బలహీనతలను తెలియజేసింది. ఈ రెండు మ్యాచుల్లోనూ ముంబై ఓడిపోయింది. దీనిపై బౌచర్ మాట్లాడాడు. ఈ సమస్యపై టీమ్ మీటింగ్స్‌లో లోతుగా చర్చించినట్లు వెల్లడించాడు. మరోసారి ఇలా జరగకుండా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. వాటిని మ్యాచుల్లో అమలు చేసి ప్రత్యర్థి జట్లు భారీ స్కోరు చేయకుండా అడ్డుకుంటామన్నాడు. ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ ఓ చిన్న శస్త్రచికిత్స కోసం బెల్జియం వెళ్లినట్లు బౌచర్ చెప్పాడు.