BBL final : సూప‌ర్ క్యాచ్‌.. ఏమి టైమింగ్ అయ్యా మీది..

దాదాపు నెల‌న్న‌ర రోజులుగా క్రికెట్ అభిమానుల‌ను అల‌రించిన బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్‌) 13వ సీజ‌న్ ముగిసింది.

BBL final : సూప‌ర్ క్యాచ్‌.. ఏమి టైమింగ్ అయ్యా మీది..

Michael Neser and Paul Walter take brilliant relay catch

BBL final 2024 : దాదాపు నెల‌న్న‌ర రోజులుగా క్రికెట్ అభిమానుల‌ను అల‌రించిన బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్‌) 13వ సీజ‌న్ ముగిసింది. బుధ‌వారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచులో బ్రిస్బేన్ హీట్‌, సిడ్నీ సిక్స‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో 54 ప‌రుగుల‌తో గెలుపొందిన‌ బ్రిస్బేన్ హీట్ బీబీఎల్ 13వ సీజ‌న్ విజేత‌గా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 166 ప‌రుగులు చేసింది. బ్రిస్బేన్ హీట్ బ్యాట‌ర్ల‌లో జోష్ బ్రౌన్ (53; 38 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. మాథ్యూ రెన్షా (40; 22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్ నాథన్ మెక్‌స్వీని (33; 32 బంతుల్లో 5 ఫోర్లు), మాక్స్ బ్రయంట్ (29; 19 బంతుల్లో 1ఫోర్‌, 2సిక్స‌ర్లు) లు రాణించారు. సిడ్నీ బౌల‌ర్ల‌లో సీన్ అబాట్ నాలుగు వికెట్లు తీశాడు.

Rohit Sharma : తొలి టెస్టుకు ముందు రోహిత్ శ‌ర్మ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. ఇంగ్లాండ్ బ‌జ్‌బాల్ ఆడితే..

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో సిడ్నీ 17.3 ఓవ‌ర్ల‌లో 112 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. సిడ్నీ బ్యాట‌ర్ల‌లో మోయిసెస్ హెన్రిక్స్(25), జోష్ ఫిలిప్స్ (23) లు ఓ మోస్త‌రుగా రాణించారు. మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో సిడ్నీకి ఓట‌మి త‌ప్ప‌లేదు. బ్రిస్బేన్ బౌల‌ర్ల‌లో స్పెన్సర్ జాన్సన్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జేవియర్ బార్ట్‌లెట్, మిచెల్ స్వెప్సన్ లు చెరో రెండు వికెట్లు తీశారు.

అద్భుత క్యాచ్‌..

ఇదిలా ఉంటే.. సిడ్నీ ఇన్నింగ్స్ స‌మ‌యంలో ఓ సంద‌ర్భంలో ప్రేక్ష‌కులు అంద‌రూ మునివేళ్ల‌పై నిల‌బ‌డ్డారు. సిడ్నీ ఇన్నింగ్స్ 18వ ఓవ‌ర్‌లో ఇది చోటు చేసుకుంది. జేవియ‌ర్ బార్లెట్ బౌలింగ్‌లో ఈ ఓవ‌ర్‌లోని రెండో బంతికి సిడ్నీ బ్యాట‌ర్ సీన్ అబాట్ లాంగ్ దిశ‌గా భారీ షాట్ ఆడాడు. అయితే.. బంతి గాల్లోకి లేచింది. బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న మైకేల్ నీస‌ర్ క్యాచ్ అందుకోవ‌డానికి వేగంగా ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చాడు.

IND vs ENG : టీమ్ఇండియాను స‌వాల్ చేసిన‌ ఇంగ్లాండ్‌..! ఒక్క రోజు ముందుగానే.. అంత న‌మ్మ‌కం ఏంటో మ‌రీ..!

బాల్‌ను అందుకున్నాడు అయితే అత‌డు బ్యాలెన్స్ లేక‌పోవ‌డంతో బౌండ‌రీ లైన్‌ను క్రాస్ చేసే స‌మ‌యంలో బాల్‌ను మైదానంలోకి విసిరివేశాడు. స్పందించిన పాల్ వాల్టెర్ దాన్ని అందుకున్నాడు. దీంతో అబాట్ ఔట్ కాగా.. ఈ అద్భుత క్యాచ్‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ప్ర‌స్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.

HE’S DONE IT AGAIN! 🤯