Mohammed Shami enters 200 T20 wickets club
టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో రెండు వందల వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో షమీ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో షమీ 4 ఓవర్లు వేసి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20ల్లో షమీ వికెట్ల సంఖ్య 201కి చేరింది.
కాగా.. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో యుజ్వేంద్ర చాహల్ తొలి స్థానంలో ఉన్నాడు. పొట్టి ఫార్మాట్‌లో చాహల్ 364 వికెట్లు పడగొట్టాడు.
IND vs AUS 3rd Test : గబ్బా టెస్టులో బుమ్రా ఆడతాడా? ఆడడా?
టీ20ల్లో 200 ఫ్లస్ వికెట్లు తీసిన భారత బౌలర్లు..
యుజ్వేంద్ర చాహల్ – 364 వికెట్లు
పీయూశ్ చావ్లా – 319 వికెట్లు
భువనేశ్వర్ కుమార్ – 310 వికెట్లు
రవిచంద్రన్ అశ్విన్ – 310 వికెట్లు
అమిత్ మిశ్రా – 285 వికెట్లు
హర్షల్ పటేల్ – 244 వికెట్లు
హర్భజన్ సింగ్ – 235 వికెట్లు
జయదేవ్ ఉనద్కత్ – 234 వికెట్లు
అక్షర్ పటేల్ – 233 వికెట్లు
రవీంద్ర జడేజా – 225 వికెట్లు
సందీప్ శర్మ- 214 వికెట్లు
అర్షదీప్ సింగ్ – 203 వికెట్లు
ఉమేశ్ యాదవ్ – 202 వికెట్లు
మహ్మద్ షమీ – 201 వికెట్లు
కుల్దీప్ యాదవ్ – 200 వికెట్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బెంగాల్‌పై బరోడా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బరోడా తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బెంగాల్ 18 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది.
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. బరోడా, ముంబై, ఢిల్లీ, మధ్యప్రదేశ్ లు సెమీస్‌కు చేరుకున్నాయి. తొలి సెమీఫైనల్‌లో బరోడా, ముంబై జట్లు తలపడనుండగా, రెండో సెమీ ఫైనల్‌లో ఢిల్లీ, మధ్యప్రదేశ్ తలపడనున్నాయి. ఈ రెండు సెమీఫైనల్ మ్యాచులు డిసెంబర్ 13న జరగనున్నాయి. ఇక ఫైనల్ డిసెంబర్ 15న జరగనుంది.
ICC Player of the Month : బుమ్రాకు షాకిచ్చిన పాకిస్థాన్ స్టార్ పేసర్..
వన్డే ప్రపంచకప్ అనంతరం శస్త్రచికిత్స చేయించుకున్న మహ్మద్ షమీ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దేశవాలీ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడిని బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఆడించాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.