ENG vs IND : అరుదైన ఘనత సాధించిన సిరాజ్..
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు.

Mohammed Siraj Bowled 1000 balls in ENG vs IND Test Series
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. ఓ టెస్టు సిరీస్‌లో 1000 ఫ్లస్ బంతులను వేసిన టీమ్ఇండియా బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో బుమ్రా, షమీ, భువనేశ్వర్, ఇషాంత్ శర్మ, జవగల్ శ్రీనాథ్, కపిల్ దేవ్ వంటి బౌలర్లు ఉన్నారు.
అండర్సన్-టెండూల్కర్ సిరీస్‌లో సిరాజ్ 5 టెస్టు మ్యాచ్‌లను ఆడాడు. ఇప్పటి వరకు సిరీస్‌లో 20 వికెట్లు తీశాడు. సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
ENG vs IND : ఐదో రోజు ఆటకు వర్షం ముప్పు? టీమ్ఇండియా అభిమానుల్లో ఆందోళన?
ఐదో టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది.మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులు చేసింది. ఆ తరువాత ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్‌కు 23 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల లక్ష్యం నిలిచింది.
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. జేమీ ఓవర్టన్ (0), జేమీ స్మిత్ (2) లు క్రీజులో ఉన్నారు. ఆఖరి రోజు భారత విజయానికి 4 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లాండ్ గెలుపుకు 35 పరుగులు కావాలి.
ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. సిరీస్ 2-2తో సమం అవుతుంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే.. అప్పుడు 3-1తో ఆతిథ్య జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.