ఐపీఎల్ అయితేనే ధోనీ వస్తాడు: రవిశాస్త్రి

ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు అంతుచిక్కడం లేదు. తోచిన మాదిరి చెప్తుండటంతో సీనియర్లు మండిపడుతున్నారు. ఇటీవల ధోనీ ఐపీఎల్ వరకూ టీమిండియాకు దూరంగా ఉంటాడని అతను బ్రేక్ తీసుకుంటున్నాడని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి వెల్లడించాడు. మిగతా వాళ్లు చర్చ ఆపాలని రవిశాస్త్రి అన్నాడు. జులైలో వరల్డ్ కప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని దూరంగా ఉన్నాడు. 

అంతర్జాతీయ క్రికెట్లోకి వస్తాడా.. లేక రిటైరవుతాడా అనేదానిపైన చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘అతనో దిగ్గజ ఆటగాడు. నాకు తెలిసిన ప్రకారం.. భారమవుతాననుకుంటే ఎట్టి పరిస్థితుల్లో జట్టులో ఉండడు. ఆట నుంచి కొంచెం విరామం కోరుకున్నాడు. కానీ ఐపీఎల్‌లో ఆడబోతున్నాడు. దాని మీద రభస అనవసరం’ అని చెప్పాడు.

టీమిండియా మూడు టీ20ల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో తలపడనుంది. బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. తుది జట్టులో మార్పులు చేసి ఈ సారైనా సంజూ శాంసన్ కు చోటు కల్పిస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.