MS Dhoni : చెన్నై ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌.. మ‌ళ్లీ కెప్టెన్‌గా ధోని.. రుతురాజ్ గైక్వాడ్‌కు షాక్‌..!

ఎంఎస్ ధోని మ‌రోసారి చెన్నై కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించే అవ‌కాశం ఉంది.

Courtesy BCCI

ఐపీఎల్ 2025లో భాగంగా శ‌నివారం ఢిల్లీక్యాపిట‌ల్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు చెన్నైలోని చెపాక్ మైదానం వేదిక కానుంది. కాగా.. ఎంఎస్ ధోని మ‌రోసారి చెన్నై కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించే అవ‌కాశం ఉంది. ఢిల్లీతో మ్యాచ్‌లోనే ధోని నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టే ఛాన్స్ ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

రెగ్యుల‌ర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఢిల్లీతో మ్యాచ్‌లో ఆడేది అనుమానంగా మారింది. రాజ‌స్థాన్‌తో మ్యాచ్‌లో అత‌డి చేతికి గాయమైంది. అయిన‌ప్ప‌టికి ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ కొన‌సాగించాడు. అయితే.. ఆ త‌రువాత ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు నిర్వ‌హించిన ప్రాక్టీస్ సెష‌న్ల‌లో అత‌డు పాల్గొన‌లేదని ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ త‌న క‌థ‌నంలో తెలిపింది.

Suryakumar Yadav : తిలక్ వ‌ర్మ రిటైర్డ్ ఔట్ పై సూర్య‌కుమార్ యాద‌వ్‌ రియాక్ష‌న్ వైర‌ల్‌.. ముంబై కోచ్ జ‌య‌వ‌ర్ధ‌నే న‌చ్చ‌జెప్పినా కూడా..

రుతురాజ్ గాయం పై శుక్ర‌వారం చెన్నై బ్యాటింగ్ కోచ్ మైక్ హ‌స్సీ స్పందించాడు. గైక్వాడ్ ఈ రోజు నెట్ సెష‌న‌ల్ రాలేద‌న్నాడు. గాయం నుంచి కోలుకుంటున్నాడ‌న్నాడు. ప్ర‌స్తుతం కొంచెం నొప్పితో అత‌డు బాధ‌ప‌డుతున్న‌ట్లుగా చెప్పుకొచ్చాడు. శ‌నివారం ఉద‌యం అత‌డు నెట్ సెష‌న్‌లో ఎలా ఆడ‌తాడో అనే దానిపై.. మ్యాచ్‌లో ఆడించాలా, వ‌ద్దా అనేది నిర్ణ‌యిస్తామ‌ని తెలిపాడు. అత‌డు కోలుకుంటాడ‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేశాడు.

రుతురాజ్ దూరం అయితే కెప్టెన్ ఎవ‌రు?

ఒక‌వేళ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌కు దూరం అయితే.. చెన్నై కెప్టెన్‌గా ఎవ‌రు బాధ్య‌త‌ల‌ను స్వీక‌రిస్తారు అనే దానిపై హ‌స్సీ చాలా తెలివిగా స‌మాధానం చెప్పాడు. ఆ విష‌యం త‌న‌కు తెలియ‌ద‌న్నాడు. దాని గురించి ఇప్ప‌టి వ‌ర‌కు తాను ఆలోచించ‌లేద‌న్నాడు. హెడ్‌కోచ్ ఫ్లెమింగ్‌, కెప్టెన్ రుతురాజ్‌లు దీని గురించి చ‌ర్చించుకున్నారో లేరో త‌న‌కు తెలియ‌ద‌న్నాడు. ఇక జ‌ట్టులో చాలా మంది యువ ఆట‌గాళ్లు ఉన్నార‌న్నాడు. వికెట్ కీప‌ర్ అయిన వ్య‌క్తి ఈ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టే అవ‌కాశం ఉండొచ్చున‌ని, ఇప్ప‌టికే అత‌డికి కొంత అనుభ‌వం ఉంద‌న్నాడు.

LSG vs MI : తిల‌క్ వ‌ర్మ రిటైర్డ్ ఔట్ పై ముంబై కోచ్ జ‌య‌వ‌ర్ధ‌నే అలా.. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఇలా..

ఇలా హ‌స్సీ.. ధోని పేరు చెప్ప‌కుండానే కెప్టెన్ ఎవ‌రు కావొచ్చున‌నే విష‌యాన్ని చెప్పేశాడు. ఒక‌వేళ రుతురాజ్ దూరం అయితే ధోని ప‌గ్గాలు అందుకోవ‌డం ఖాయంగా తెలుస్తోంది. దీంతో సీఎస్‌కే అభిమానులు ధోనిని కెప్టెన్‌గా చూడాల‌ని కోరుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచ్‌లు ఆడింది. ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. మ‌రో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్ర‌స్తుతం ఆ జ‌ట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉండ‌గా, నెట్‌ర‌న్‌రేట్ -0.771గా ఉంది. పాయింట్ల ప‌ట్టిక‌లో చెన్నై 8వ స్థానంలో కొన‌సాగుతోంది.