ధోనీని ప్రధాన మంత్రిని చేయాలి

టీమిండియా మాజీ కెప్టెన్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ప్రధాని చేయాలంటున్నారు నెటిజన్లు. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లో కీలకమైన పరుగులు అందించడంతో పాటు 48 బంతుల్లో 84పరుగులు చేసి దాదాపు విజయానికి చేరువ చేశాడు. 
Also Read : ధోనీని ప్రధాన మంత్రిని చేయాలి

అసాధ్యమనుకుంటున్న లక్ష్యాన్ని క్షణాల వ్యవధిలో గెలిచేయగలమని చూపించాడు. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ చూసిన అభిమానులు ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓడినప్పటికీ ధోనీని తెగపొగిడేస్తున్నారు. ధోనీ హీరోయిజం మరోసారి చూశామంటూ ట్విట్టర్ వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

మోడీ.. రాహుల్ గాంధీని మర్చిపోండి. మహేంద్ర సింగ్ ధోనీని ప్రధానిని చేయండి.

 

ధోనీ ఎన్నికల్లో నిలుచుంటాడో లేదో తెలియదు కానీ, ఒకవేళ నిలబడితే నా ఓటు ధోనీకే. అతనొక లెజెండ్. ఎలాంటి అసాధ్యాన్నైనా చేసి చూపించగలడు. 

ధోనీ కనుక రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే.. దేశంలోని వనరులను వాడుకుని మరింత అభివృద్ధి చేయగలడు. లెజెండరీ లీడర్‌కు న్యాయం చేయాలంటే పీఎం కావాలసిందే.

ఓ చౌకీదార్ కూడా ట్విట్టర్‌లో ‘ఎన్నికల్లో ధోనీ పోటీ చేస్తే నా ఓటును ధోనీకే వేస్తా’ అని  ట్వీట్ చేశాడు.