MS Dhoni: ఐపీఎల్‌లో ధోని ద్విశతకం.. కెప్టెన్ కూల్ ఘనత
చెపాక్ మైదానంలో నేడు రాజస్థాన్‌తో చెన్నై జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ ధోనికి చాలా ప్రత్యేకం కానుంది. చెన్నై జట్టు కెప్టెన్‌గా ధోనికి ఇది 200వ మ్యాచ్.

MS Dhoni
MS Dhoni: ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి అంటే 2008 నుంచి మహేంద్ర సింగ్ ధోని చైన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మధ్యలో రెండు సంవత్సరాల పాటు చెన్నై పై నిషేదం విధించిన సమయం మినహా మిగిలిన అన్ని సీజన్లలో చెన్నై తరుపుననే మిస్టర్ కూల్ ఆడాడు. కెప్టెన్‌గా చెన్నై జట్టుకు నాలుగు సార్లు టైటిల్‌ను అందించాడు. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నైని నిలిపిన ఘనత ధోనిదే. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు.
IPL 2023, CSK vs RR: చెపాక్‌లో గర్జించేది ఎవరో..? హెడ్ టూ హెడ్ రికార్డు ఇదే
అయితే.. నేడు చెపాక్ మైదానంలో రాజస్థాన్‌తో చెన్నై జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ ధోనికి చాలా ప్రత్యేకం కానుంది. చెన్నై జట్టు కెప్టెన్‌గా ధోనికి ఇది 200వ మ్యాచ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని రికార్డు ఇది. ఇప్పటి వరకు మహేంద్రుడు ఐపీఎల్‌లో 213 మ్యాచుల్లో సారథిగా వ్యవహరించాడు. చెన్నైపై నిషేద సమయంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టుకు కూడా ధోని కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్ జట్టును నిషేధించాలి.. తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల డిమాండ్..
ధోని సారథ్యంలో చెన్నై ఇప్పటి వరకు 11 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది. ఇందులో 9 సార్లు ఫైనల్‌కు వెళ్లింది. మరే జట్టు కూడా ఇన్ని సార్లు ఫైనల్‌కు చేరలేదు. ప్రస్తుత సీజన్‌లో ధోని సారథ్యంలో చెన్నై మూడు మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచుల్లో విజయం సాధించగా ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.