MS Dhoni: ధోనీ క్రీజ్‌లోకి వచ్చాడంటే అంతేమరి.. జియోసినిమా యాప్‌లో రికార్డు స్థాయిలో వీక్షకులు

టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ క్రీజులో ఉన్నాడంటే క్రికెట్ ప్రియులు టీవీలకు అతుక్కుపోతారు. అందులోనూ చివరి ఓవర్లలో ధోనీ క్రీజులో ఉంటే సిక్సర్ల మోత ఖాయం. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్ లో ధోనీ క్రీజులో ఉన్న సమయంలో జియో సినిమా యాప్‌ను రికార్డు స్థాయిలో యూజర్లు వీక్షించడం, ధోనీపై క్రికెట్ ఫ్యాన్స్‌లో క్రేజ్‌ను తెలియజేస్తుంది.

MS Dhoni: ధోనీ క్రీజ్‌లోకి వచ్చాడంటే అంతేమరి.. జియోసినిమా యాప్‌లో రికార్డు స్థాయిలో వీక్షకులు

MS Dhoni

Updated On : April 4, 2023 / 8:35 AM IST

MS Dhoni: టీమిండియా (Team India) మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ (M.S. Dhoni) క్రీజులో ఉంటే ఆ మజానే వేరు. ఇక చివరి ఓవర్లలో క్రీజులో ఉన్నాడంటే క్రికెట్ ప్రియులు టీవీలకు అతక్కుపోతారు. ఎందుకంటే.. ప్రత్యర్థి బౌలర్ ఎంతటి అనుభవజ్ఞుడైనా సిక్సర్ల మోత మోగించడం ధోనీ స్పెషాల్టీ.  భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన ధోనీ.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL) 16వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. మార్చి 31న ఐపీఎల్ 2023 (IPL 2023)  సీజన్‌ ప్రారంభం కాగా ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచ్ లు ఆడింది. ఈ రెండు మ్యాచ్‌లలో ధోనీ బ్యాటింగ్ సమయంలో జియోసినిమా యాప్‌ (Jio Cinema app) లో రికార్డు స్థాయిలో యూవర్స్ మ్యాచ్‌ను వీక్షించారు.

IPL 2023, CSK vs LSG : లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం

ఐపీఎల్ 2023 సీజన్‌కు డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్ (Reliance) దక్కించుకున్న విషయం విధితమే. దీంతో జియోసినిమా యాప్ (Jio Cinema app) ద్వారా ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్ లను ప్రసారం చేస్తుంది. క్రికెట్ ప్రియులు భారీ సంఖ్యలో జియో యాప్ ద్వారా మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. దీంతో డిజిటల్ రంగంలో జియోసినిమా యాప్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. మరోవైపు ధోనీ క్రీజులో ఉన్న సమయంలో అయితే.. ఎక్కువ శాతం మంది జియోసినిమా యాప్‌లో ఐపీఎల్‌ను వీక్షిస్తున్నారట.

IPL 2023: ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా 11వ సారి సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్

చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2023 సీజన్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడింది. తొలి మ్యాచ్ ఓడిపోయినా.. రెండో మ్యాచ్ లో విజయం సాధించింది. మొదటి మ్యాచ్‌ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 1.6 కోట్ల మంది ప్రేక్షకులు జియో సినిమా యాప్‌లో మ్యాచ్ వీక్షించారట. సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ధోనీ చివరి ఓవర్లో క్రీజులోకి వచ్చి సిక్సర్ల మోతమోగించారు. ఆ సమయంలో జియో సినిమా యాప్ ద్వారా 1.70కోట్ల మంది మ్యాచ్ ను వీక్షించినట్లు జియో పేర్కొంది. దీంతో ఐపీఎల్ 2023లో అత్యధిక వ్యూయర్ షిప్ గా నమోదైంది.