pic credit @ MI
ఐపీఎల్ 2025 సీజన్‌లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోగా, పంజాబ్ కింగ్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలో నేటి మ్యాచ్‌లో విజయం సాధించి ఈ సీజన్‌లో గెలుపు బోణీ కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
కాగా.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిషేదం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడలేదు. ఐపీఎల్ 2024 సీజన్‌లో మూడు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్‌రేటుకు పాల్పడడంతో పాండ్యా పై ఓ మ్యాచ్ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అతడు గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ కు జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
CSK vs RCB : చెన్నై పై విరాట్ అరుదైన ఘనత.. చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ..
హార్దిక్ పాండ్యా చేరికతో ముంబై ఇండియన్స్ బలం పెరిగిందని టీమ్ఇండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా తెలిపాడు. అతడు రావడంతో జట్టుకు సమతూకం వస్తుందన్నాడు. అతడు వారి ఎక్స్-ఫ్యాక్టర్ ఆటగాడిని తెలిపాడు. గత మ్యాచ్‌ల్లో పంత్, రజత్ పాటిదార్ కెప్టెన్లుగా ఎలాంటి ప్రభావం చూపారో.. హార్దిక్ నుంచి అలాంటి ప్రదర్శననే ఫ్యాన్స్ ఆశిస్తున్నట్లు స్టార్ స్పోర్ట్స్‌లో మాట్లాడుతూ రైనా చెప్పాడు.
పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలో అతడు ఫామ్‌లోకి వస్తే ముంబైకి కష్టాలు తప్పవని సంజయ్ బంగర్ తెలిపాడు. ‘తొలి మ్యాచ్ గుజరాత్ పై సిరాజ్ మంచి ప్రదర్శన చేయలేదు. ఇప్పుడు ముంబైతో మ్యాచ్‌లో అతడు రాణించాలని అనుకుంటున్నాడు. ముఖ్యంగా రోహిత్ పై ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తున్నట్లు.’ బంగర్ చెప్పాడు.
CSK vs RCB : మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు.. చెన్నై కోచింగ్ సిబ్బంది పై తీవ్ర విమర్శలు..
కాగా.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు 5 సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో గుజరాత్ టైటాన్స్ గెలవగా, మరో రెండు మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.
రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ అంచనా..
గుజరాత్ టైటాన్స్..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంపాక్ట్ ప్లేయర్.. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్
ముంబై ఇండియన్స్..
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు.
ఇంపాక్ట్ ప్లేయర్.. విఘ్నేష్ పుత్తూరు