CSK vs RCB : మ‌నోజ్ తివారీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. చెన్నై కోచింగ్ సిబ్బంది పై తీవ్ర విమ‌ర్శ‌లు..

సీఎస్‌కే కోచింగ్ సిబ్బంది పై కేకేఆర్ మాజీ ఆట‌గాడు మ‌నోజ్ తివారీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశాడు.

CSK vs RCB : మ‌నోజ్ తివారీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. చెన్నై కోచింగ్ సిబ్బంది పై తీవ్ర విమ‌ర్శ‌లు..

Courtesy BCCI

Updated On : March 29, 2025 / 10:33 AM IST

శుక్ర‌వారం చెన్నైలోని చెపాక్ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ 50 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. 197 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో సీఎస్‌కే 146/8 స్కోరుకే ప‌రిమిత‌మైంది. కాగా.. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. 16 బంతులు ఎదుర్కొన్న అత‌డు 3 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో 30 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

ఈ క్ర‌మంలో ధోని బ్యాటింగ్ ఆర్డ‌ర్ కాస్త ముందుకు వ‌చ్చి ఉంటే మ్యాచ్ ఫ‌లితం మ‌రోలా ఉండేద‌ని ప‌లువురు మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

13 ఓవ‌ర్ల‌లోపే 80 ప‌రుగుల‌కే చెన్నై ఆరు వికెట్లు కోల్పోయింది. ర‌వీంద్ర జ‌డేజా క్రీజులో ఉన్నాడు. ఈ స‌మ‌యంలో ధోని బ్యాటింగ్‌కు వ‌స్తాడ‌ని భావిస్తే.. అలా జ‌ర‌గ‌లేదు. ర‌విచంద్ర‌న్ అశ్విన్ వ‌చ్చాడు. అశ్విన్‌ ఔట్ అయిన త‌రువాత ధోని వ‌చ్చాడు.

Shardul Thakur : వేలంలో అన్‌సోల్డ్.. శార్దూల్ జీవితాన్నిమ‌లుపుతిప్పిన జ‌హీర్ ఖాన్ ఫోన్ కాల్‌..

అలా చెప్పే ధైర్యం వారికి లేదు..

అప్ప‌టికే సీఎస్‌కే ఓట‌మి ఖాయ‌మైంది. ధోని వ‌చ్చిరావ‌డంతోనే బౌండ‌రీలు కొట్టిన‌ప్ప‌టికి ఫ‌లితం లేకుండా పోయింది. అది ఓట‌మి అంత‌రాన్ని మాత్ర‌మే త‌గ్గించింది. దీనిపైనే కేకేఆర్ మాజీ ఆట‌గాడు మ‌రోజ్ తివారీ మాట్లాడాడు. బ్యాటింగ్ ఆర్డ‌ర్ లో ధోనిని ముందుకు వెళ్లాల‌నే చెప్పే ధైర్యం సీఎస్‌కే కోచింగ్ సిబ్బంది చేయ‌లేక‌పోయింద‌ని తీవ్రంగా విమ‌ర్శించాడు.

‘నాకు అర్థంకానీ విష‌యం ఏంటంటే..? 16 బంతుల్లో 30 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచిన దోని లాంటి ఆట‌గాడిని బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ముందుకు ఎందుకు పంప‌కూడ‌దు? మీరు గెల‌వ‌డానికే ఆడుతున్నారా? ఇది స‌రైందేనా?.’ అని మ‌నోజ్ తివారీ క్రిక్‌బ‌జ్‌తో మాట్లాడుతూ అన్నాడు.

ధోనిని బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ముందుకు వెళ్లాల‌నే చెప్పే ధైర్యం సీఎస్ కే కోచింగ్ సిబ్బంది చేయ‌లేక‌పోతున్నారు. ధోని తాను ఆ స్థానంలో ఆడ‌తాన‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డంతో వారు ఏమీ చేయ‌లేక‌పోతున్నారు అని తివారీ అన్నాడు.

CSK vs RCB : ఆర్‌సీబీ చేతిలో ఓట‌మి.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ వింత వ్యాఖ్య‌లు.. సంతోషంగా ఉంది..

టీమ్ ఇండియా మాజీ ఆట‌గాడు ఇర్ఫాన్ ప‌ఠాన్ సైతం ధోని తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావ‌డాన్ని త‌ప్పుబ‌ట్టాడు. సీఎస్‌కే జ‌ట్టు మేనేజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణ‌యం బాగాలేద‌న్నాడు. దీని వ‌ల్ల జ‌ట్టుకు ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్నాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ర‌జత్ పాటీదార్‌ (51; 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), ఫిల్‌ సాల్ట్‌ (32; 16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), దేవ‌ద‌త్‌ పడిక్కల్‌ (27; 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), టిమ్‌ డేవిడ్‌ (22 నాటౌట్‌; 8 బంతుల్లో 1ఫోర్‌, 3 సిక్స‌ర్లు) లు రాణించ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు సాధించింది. చెన్నై బౌలర్లలో నూర్‌ అహ్మద్ మూడు వికెట్లు తీయ‌గా, ప‌తిర‌ణ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

MS Dhoni : చెన్నై మ్యాచ్ ఓడిపోయినా.. చ‌రిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని.. ఒకే ఒక సీఎస్‌కే ఆట‌గాడు

అనంత‌రం ర‌చిన్ ర‌వీంద్ర (41; 31 బంతుల్లో 5 ఫోర్లు), ఎంఎస్ ధోని (30 నాటౌట్; 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించిన‌ప్ప‌టికి చెన్నై సూప‌ర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 146 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డ‌కౌట్ కాగా.. దీప‌క్ హుడా (4), సామ్ కుర్రాన్ (8), రాహుల్ త్రిపాఠి (5) లు ఘోరంగా విఫ‌లం అయ్యారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో హేజిల్‌వుడ్ మూడు వికెట్లు, య‌శ్ ద‌యాళ్, లియామ్ లివింగ్‌స్ట‌న్ లు త‌లా రెండు వికెట్లు తీశారు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఓ వికెట్ సాధించారు.