CSK vs RCB : చెన్నై పై విరాట్ అరుదైన ఘనత.. చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ..
చెన్నై సూపర్ కింగ్స్ పై విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.

Courtesy BCCI
దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెన్నైలోని చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ పై విజేతగా నిలిచింది. శుక్రవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 50 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు సాధించింది. కెప్టెన్ రజత్ పాటిదార్ (51) హాఫ్ సెంచరీ చేశాడు. ఫిల్ సాల్ట్ (32), విరాట్ కోహ్లీ (31) లు రాణించారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా, పతిరణ రెండు వికెట్లు సాధించాడు.
CSK vs RCB : మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు.. చెన్నై కోచింగ్ సిబ్బంది పై తీవ్ర విమర్శలు..
అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులే పరిమితమైంది. రచిన్ రవీంద్ర (41; 31 బంతుల్లో 5 ఫోర్లు), ఎంఎస్ ధోని (30 నాటౌట్; 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించారు. బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్ మూడు వికెట్లు, యశ్ దయాళ్, లియామ్ లివింగ్‌స్టన్ లు తలా రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్ ఓ వికెట్ సాధించారు.
చరిత్ర సృష్టించిన కోహ్లీ..
చెన్నైతో మ్యాచ్‌లో కోహ్లీ చాలా నిదానంగా బ్యాటింగ్ చేశాడు. 30 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 31 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను కోహ్లీ అందుకున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో అతడు శిఖర్ ధావన్ ను అధిగమించాడు.
MS Dhoni : చెన్నై మ్యాచ్ ఓడిపోయినా.. చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని.. ఒకే ఒక సీఎస్‌కే ఆటగాడు
చెన్నై పై ధావన్ 1057 పరుగులు చేయగా, తాజా మ్యాచ్‌తో కలిపి 1083 పరుగులు చేశాడు. వీరిద్దరు మినహా మరే బ్యాటర్ కూడా చెన్నైపై వెయ్యి పరుగులు చేయలేదు.
చెన్నై పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
* విరాట్ కోహ్లీ – 1084 పరుగులు
* శిఖర్ ధావన్ – 1057 పరుగులు
* రోహిత్ శర్మ – 896 పరుగులు
* దినేష్ కార్తీక్ – 727 పరుగులు
* డేవిడ్ వార్నర్ – 696 పరుగులు