Mustafizur Rahman : బంగ్లాదేశ్ స్టార్ పేస‌ర్ ముస్తాఫిజుర్ రెహమాన్ త‌ల‌కు గాయం.. ఐసీయూలో చికిత్స‌

బంగ్లాదేశ్ స్టార్ పేస‌ర్ ముస్తాఫిజుర్ రెహమాన్ త‌ల‌కు గాయ‌మైంది.

Mustafizur Rahman : బంగ్లాదేశ్ స్టార్ పేస‌ర్ ముస్తాఫిజుర్ రెహమాన్ త‌ల‌కు గాయం.. ఐసీయూలో చికిత్స‌

Mustafizur Rahman taken to hospital after blow to head

Updated On : February 18, 2024 / 4:06 PM IST

Mustafiz hospitalised : బంగ్లాదేశ్ స్టార్ పేస‌ర్ ముస్తాఫిజుర్ రెహమాన్ త‌ల‌కు గాయ‌మైంది. బంగ్లాదేశ్ ప్రీమియ‌ర్ లీగ్ (బీపీఎల్‌)లో అత‌డు కొమిల్లా విక్టోరియ‌న్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. కొమిల్లా విక్టోరియ‌న్స్ త‌న త‌దుప‌రి మ్యాచ్‌లో సిల్హ‌ట్ స్ట్రైక‌ర్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ కోసం చటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో కొమిల్లా విక్టోరియ‌న్స్ ఆట‌గాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న ముస్తాఫిజుర్ గాయ‌ప‌డ్డాడు.

నెట్స్‌లో బౌలింగ్ వేయ‌డానికి ముస్తాఫిజుర్ త‌న ఎండ్‌కు వెలుతుండ‌గా బ్యాట‌ర్ లిట‌న్ దాస్ కొట్టిన బంతి అత‌డి ఎడ‌మ కంటి పై భాగంలో బ‌లంగా తాకింది. వెంట‌నే అత‌డి త‌ల నుంచి ర‌క్తం కారింది. ప‌క్కనున్న వారు వెంట‌నే స్పందించి ప్రాథ‌మిక చికిత్స అందించారు. అనంత‌రం అంబులెన్స్‌లో ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

Yashasvi Jaiswal : య‌శ‌స్వి జైస్వాల్ సిక్స‌ర్ల మోత‌.. ప్ర‌పంచ రికార్డు స‌మం

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ముస్తాఫిజుర్ గాయంపై అప్‌డేట్ ఇచ్చింది. అత‌డు గాయ‌ప‌డిన వెంట‌నే ఫిజియోలు ర‌క్త‌స్రావం కాకుండా చూసిన‌ట్లు తెలిపింది. అత‌డికి స్కానింగ్‌లు నిర్వ‌హించార‌ని, వైద్య ప‌రీక్ష‌ల్లో త‌ల లోప‌లి భాగంలో ఎలాంటి ర‌క్త‌స్రావం జ‌ర‌గ‌లేద‌ని తేలిన‌ట్లు చెప్పింది. అత‌డు కోలుకునేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపింది.