Asian Games : తెలంగాణ అథ్లెట్ పై స్వప్న బర్మన్‌ సంచ‌ల‌న ఆరోపణ‌.. ట్రాన్స్‌జెండ‌ర్ అంటూ.. కౌంట‌ర్ ఇచ్చిన నందిని

చైనా వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌ల్లో మ‌హిళా హెప్టాథ్లాన్ విభాగంలో తెలంగాణ అథ్లెట్ నందిని కాంస్య ప‌త‌కాన్ని సొంతం చేసుకుంది. అయితే.. ఆమె పై టీమ్ మేట్, ప‌శ్చిమ బెంగాల్ హెప్టాథ్లెట్‌ స్వప్ప బర్మన్‌ సంచలన ఆరోప‌ణ‌లు చేసింది.

Asian Games : తెలంగాణ అథ్లెట్ పై స్వప్న బర్మన్‌ సంచ‌ల‌న ఆరోపణ‌.. ట్రాన్స్‌జెండ‌ర్ అంటూ.. కౌంట‌ర్ ఇచ్చిన నందిని

Nandini Agasara - Swapna Barman

Asian Games 2023 : చైనా వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌ల్లో (Asian Games) మహిళా హెప్టాథ్లాన్ విభాగంలో తెలంగాణ అథ్లెట్ నందిని ( Nandini Agasara) కాంస్య ప‌త‌కాన్ని సొంతం చేసుకుంది. అయితే.. ఆమె పై టీమ్ మేట్, ప‌శ్చిమ బెంగాల్ హెప్టాథ్లెట్‌ స్వప్ప బర్మన్‌ (Swapna Barman) సంచలన ఆరోప‌ణ‌లు చేసింది. నందిని ఓ ట్రాన్స్ జెండ‌ర్ అని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. త‌న‌కు రావాల్సిన ప‌త‌కాన్ని ఆమె ఎగరేసుకుపోయింద‌ని ఆరోపించింది. నిబంధ‌న‌ల‌కు విరుద్ద‌మైనా స‌రే త‌న‌కు రావాల్సిన మెడ‌ల్‌ను తిరిగి ఇచ్చేయాల‌ని కోరుతున్నాన‌ని, ద‌య‌చేసి త‌న‌కు సాయం చేయండి అని స్వ‌ప్న ట్వీట్ చేసింది.

‘చైనాలోని హౌంగ్జూలో 19వ ఆసియా క్రీడ‌ల్లో భాగంగా నేను నా కాంస్య ప‌త‌కాన్ని ట్రాన్స్ జెండ‌ర్ ఉమెన్‌కు కోల్పోయాను. నిబంధ‌న‌ల‌కు విరుద్ద‌మైనా స‌రే నా మెడ‌ల్ నాకు కావాలి. ద‌య‌చేసి నాకు సాయం చేయండి.’ అని స్వ‌ప్న ట్వీట్ చేసింది. నందిని అగ‌సారా పేరును ప్ర‌స్తావించ‌కుండానే ఆమెను ఉద్దేశించి ట్వీట్ చేయ‌గా ఏమైందో తెలియ‌దు గానీ కాసేప‌టి త‌రువాత దానిని డిలీట్ చేసింది. అయితే.. అప్ప‌టికే ఆమె ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు వైర‌ల్‌గా మారాయి.

Lost My Medal To Transgender Alleges Swapna Barman

Lost My Medal To Transgender Alleges Swapna Barman

నాలుగో స్థానంలో నిలిచిన స్వప్న‌

సోమ‌వారం జ‌రిగిన మ‌హిళ‌ల హెప్టాథ్లాన్ ఫైన‌ల్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నందిని అగ‌సారా 5,712 పాయింట్ల‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్య ప‌త‌కాన్ని సొంతం చేసుకుంది. అయితే.. ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన స్వ‌ప్న బ‌ర్మ‌న్ 5,708 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో ప‌త‌కాన్ని కోల్పోయింది. ఈ క్ర‌మంలోనే త‌న‌కు రావాల్సిన కాంస్య ప‌త‌కాన్ని ఓ ట్రాన్స్‌జెండ‌ర్‌కు వ‌దులుకోవాల్సి వ‌చ్చింద‌ని స్వప్న బ‌ర్మ‌న్ చేసిన ట్వీట్ వివాదాస్ప‌ద‌మైంది.

ODI World Cup 2023 : ప్ర‌పంచ క‌ప్‌లో సెమీస్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే..?

నేను ఏంటో నాకు తెలుసు.. నందిని

దీనిపై నందిని స్పందించింది. త‌న విజ‌యాన్ని త‌క్కువ చేసి మాట్లాడ‌డం, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాదంటూ కౌంట‌ర్ ఇచ్చింది. తాను ఏంటో త‌న‌కు తెలుసున‌ని, ఆమె ద‌గ్గ‌ర ఏమైన ఆధారాలు ఉంటే చూపించాల‌ని స‌వాల్ విసిరింది.

“నేను ఏంటో నాకు తెలుసు. ఆమె దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలి. నేను కూడా దేశం కోసం సాధించిన పతకాన్ని చూపిస్తా. నేను దేశానికి మంచి పేరు తేవాలని మాత్రమే అనుకుంటున్నాను. మనం పతకం గెలిచాం. అంద‌రూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే.. బర్మన్‌ ఆరోపణలపై నేను అథ్లెటిక్స్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (AFI) దృష్టికి తీసుకువెళ‌తాను. వాస్తవానికి పతకం గెలిచిన సందర్భాన్ని ఆనందించాల‌ని అనుకున్నాను. అయితే.. అమ్మ‌కు ఆరోగ్యం బాగా లేక‌పోవ‌డంతో ఇండియాకు వెలుతున్నాను.” అని నందిని అగ‌సారా తెలిపింది.

Virat Kohli : టీమ్ఇండియాతో తిరువ‌నంత‌పురం వెళ్ల‌ని కోహ్లీ..! ముంబైకి ఎందుకు వెళ్లాడు..?