Ashes : గాయం వేధిస్తున్నా.. కుంటుతూనే క్రీజులోకి.. లేచి నిలబడి చప్పట్లు కొట్టిన ప్రేక్షకులు.. అయితే..

Nathan Lyon
Ashes ENG vs AUS : ప్రతిష్టాత్మక యాషెస్ ((Ashes) సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ (England), ఆస్ట్రేలియా (Australia) జట్ల మధ్య లార్డ్స్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. రెండో రోజు ఆటలో ఆసీస్ ఆటగాడు నాథన్ లైయన్ (Nathan Lyon) ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. అతడి కాలికి గాయం కావడంతో మూడో రోజు అతడు మైదానంలోకి అడుగుపెట్టలేదు. అయితే.. నాలుగో రోజు మాత్రం జట్టు కోసం గ్రౌండ్‌లోకి వచ్చాడు. ఓ వైపు గాయం తాలుకూ నొప్పి వేధిస్తున్నా భరిస్తూ కుంటుకుంటూ క్రీజులోకి వచ్చాడు. తన జట్టు కోసం వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని ప్యాడ్లు కట్టుకుని బరిలోకి దిగాడు.
మొత్తంగా 13 బంతుల్లు ఎదుర్కొని నాలుగు పరుగులు చేసి ఆఖరి వికెట్‌గా ఔట్ అయ్యాడు. లైయన్ స్టేడియంలోకి వచ్చేటప్పుడు, తిరిగి ఔటై డ్రెస్సింగ్‌లోకి వెళ్లేటప్పుడు ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో అతడిని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరూ ప్రశంసిస్తుంటే.. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ (kevin pietersen) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
Marnus Labuschagne : నీ కక్కుర్తి తగలేయా.. ఇదేం పనీ.. వీడియో వైరల్
Here he comes! #Ashes pic.twitter.com/2t954CNI7g
— cricket.com.au (@cricketcomau) July 1, 2023
Ashes : ఆస్ట్రేలియాకు భారీ షాక్.. స్పిన్నర్ నాథన్ లైయన్‌కు గాయం.. ఆడడం కష్టమే..!
నాథన్ లైయన్ బ్యాటింగ్‌కు రావడానికి ప్రధాన కారణం కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మరొకరిని తీసుకోవడానికి అనే అర్థం వచ్చేలాగా పీటర్సన్ వ్యాఖ్యానించాడు. దీనిపై లైయన్ స్పందించాడు. ఈ వ్యాఖ్యలను అతడు ఖండించాడు. ఆటలో గాయాలు కావడం సహజమన్నాడు. తలకు బంతి తగలడంతో తన సహచరుడు పిల్ హ్యూజ్ కోల్పోయిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. కంకషన్ కోసం ప్రయత్నించడం చాలా రిస్క్‌తో కూడుకున్నదని, తలకు గాయమైతేనే అది సాధ్యమన్నాడు. ప్రాణాలకు ముప్పు ఉంటుందని చెప్పాడు. అదృష్ట వశాత్తు తనకు అలాంటి గాయం కాలేదని, కాబట్టి సంతోషంగా ఉన్నట్లు లైయన్ చెప్పుకొచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 371 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 114 పరుగులతో నిలిచింది. క్రీజులో బెన్ డకెట్ (50), బెన్ స్టోక్స్(29)లు ఉన్నారు. ఆఖరి రోజు ఇంగ్లాండ్ విజయానికి 257 పరుగులు అవసరం కాగా.. ఆసీస్ గెలుపుకు 6 వికెట్లు కావాలి. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 279 పరుగులకు కుప్పకూలింది.