Ravichandran Ashwin : ఆ రోజు కోహ్లి కళ్లలోకి చూసినప్పుడు.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నా కెరీర్ అక్కడితో ముగిసి ఉండేది
గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పై టీమ్ఇండియా ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. గెలుపుకు కోహ్లి బాటలు వేసినా ఆఖరి బంతికి నరాలు తెగే ఉత్కంఠ మధ్య భారత్ కు విజయాన్ని అందించింది మాత్రం రవిచంద్రన్ అశ్విన్.

Ashwin-Kohli
Ashwin-Kohli : గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పై టీమ్ఇండియా ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడింది టీమ్ఇండియా. అయితే.. విరాట్ కోహ్లి(82 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. విరాట్ (Virat Kohli) కెరీర్‌లోని అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఇది ఒకటిగా నిలిచింది. గెలుపుకు కోహ్లి బాటలు వేసినా ఆఖరి బంతికి నరాలు తెగే ఉత్కంఠ మధ్య భారత్ కు విజయాన్ని అందించింది మాత్రం రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin ).
భారత జట్టు గెలవాలంటే రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం. క్రీజులో విరాట్ కోహ్లి, దినేశ్ కార్తిక్ లు ఉన్నారు. ఈజీగానే గెలవొచ్చు అని అనిపించింది. అయితే.. మహ్మద్ నవాజ్ వేసిన ఐదో బంతికి కార్తిక్ స్టంపౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠకు దారి తీసింది. ఆ సమయంలో క్రీజులోకి అశ్విన్ వచ్చాడు. భారత విజయ సమీకరణం ఒక్క బంతికి రెండు పరుగులు గా ఉంది. నవాజ్ ఆఖరి బంతి వేయగా.. బాల్ గమనాన్ని ఊహించిన అశ్విన్ వైడ్ వెలుతుందని గ్రహించి దానిని వదిలివేశాడు. దీంతో చివరి బంతికి ఒక్క పరుగు అవసరం కాగా.. షాట్ కొట్టి అశ్విన్ మ్యాచ్‌ను గెలిపించాడు.
WI Vs Ind : విడతల వారీగా విండీస్‌కు పయనమైన భారత ఆటగాళ్లు.. రోహిత్, కోహ్లి లేకుండానే..
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌ను విడుదల చేసిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాటి మ్యాచ్‌కు సంబంధించి అశ్విన్ ఆక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ మ్యాచ్ గురించి తలచుకున్నప్పుడు వెన్నులో వణుకుపుడుతోందని అన్నాడు. కార్తిక్ ఔట్ కావడంతో అతడిపై తనకు చాలా కోపం వచ్చిందని చెప్పుకొచ్చాడు. క్రీజులోకి వస్తున్న సమయంలో అభిమానుల నినాదాలు విన్నాను. ఇంతకముందు ఎప్పుడూ ఇలాంటి వాతావరణాన్ని, మద్దతును చూడలేదని, తనకు లభించిన గొప్ప అవకాశంగా భావించినట్లు అశ్విన్ తెలిపాడు.
‘క్రీజులోకి వెళ్లగానే విరాట్ కోహ్లి నా దగ్గరికి వచ్చాడు. ఆఖరి బంతిని ఎలా ఆడాలన్న దానిపై నాకు ఏడు ఆప్షన్లు చెప్పాడు. అయితే.. ఆ సమయంలో నా మనసులో ఒక్కటే అనుకున్నా. అన్ని షాట్లు ఆడే సామర్థ్యం నాలో ఉంటే నేను ఎనిమిదో స్థానంలో ఎందుకు బ్యాటింగ్ చేస్తానని. అయితే.. ఆ విషయాన్ని విరాట్‌తో చెప్పలేదు. కోహ్లితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే.. అతడి కళ్లలో ఆ సమయంలో ఏదో తెలియని పవర్ కనిపించింది. వేరే గ్రహం నుంచి వచ్చాడా అని అనిపించింది. నవాజ్ వైడ్ వేయడంతో ఈ మ్యాచ్ గెలుస్తామనే నమ్మకం వచ్చింది. నా చేతుల్లో విజయం రాసిపెట్టి ఉందని భావించా.’ అని అశ్విన్ చెప్పాడు.
Sourav Ganguly : 18 నెలలు ఆటకు దూరం.. వైస్ కెప్టెనా.. ఏంటో.. ?
ప్రతి రోజు పడుకునే ముందు ఈ మ్యాచ్ గురించే ఆలోచిస్తూ ఉంటానని, ఏం జరిగిందని వీడియోను చూస్తుంటానని అశ్విన్ తెలిపాడు. ఒకవేళ ఆ బంతి వైడ్‌గా కాకుండా ఫ్యాడ్‌ను తాకి ఉంటే ఏం జరిగిఉండేదని ఆలోచిస్తేనే తన వెన్నులో వణుకుపుడుతుందని చెప్పుకొచ్చాడు. అదే జరిగితే తన కెరీర్ అక్కడితో ముగిసిపోయి ఉండేది అశ్విన్ వ్యాఖ్యానించాడు. అయితే.. విరాట్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అసాధారణమైందని అన్నాడు.
View this post on Instagram
Virat Kohli : లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న కోహ్లి.. ఫోటోలు వైరల్
ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచ కప్ 2023షెడ్యూల్‌లో భాగంగా అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.