IPL 2024 : కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్, లక్నో జట్లకు షాక్..!
ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్ధం అవుతున్న అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్, ఫజల్‌హక్ ఫరూఖీలకు గట్టి షాక్ తగిలింది.

Trio From LSG, KKR, SRH Could Miss IPL As Board Refuses To Give NOCs
IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కోసం సిద్ధం అవుతున్న అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్, ఫజల్‌హక్ ఫరూఖీలకు గట్టి షాక్ తగిలింది. వీరికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOCలు) ఇవ్వకూడదని ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయించుకుంది. ఈ ముగ్గురు దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే వివిధ దేశాల్లో జరిగే లీగులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించింది.
ఐపీఎల్‌లతో పాటు వివిధ దేశాల్లో నిర్వహించే లీగుల్లో వీరు ఆడకుండా ఆ దేశ క్రికెట్ బోర్డు వీరిపై రెండేళ్ల పాటు నిషేదం విధించింది. అంతేకాకుండా వీరికి ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం లేదని సమాచారం. ఇక ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి ఓ ప్రత్యేక కమిటీని నియమించింది.
ఈ ఆటగాళ్లకు దేశం కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యం అయ్యాయని, తమ పేర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ కోసం పరిశీలించవద్దని వారు క్రికెట్ బోర్డుకు తెలిపారు. అయితే.. 2024 జనవరి నుంచి దేశం కోసం ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వీరు వివిధ దేశాల్లో నిర్వహించే లీగుల్లో ఆడాలని అనుకుంటున్నారు. అందుకనే వీళ్లకు ఓ సంవత్సరం పాటు సెంట్రల్ కాంట్రాక్టు ఇచ్చే ప్రస్తకే లేదని ఏ అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారి తెలిపారు.
ఐపీఎల్ జట్లకు షాక్..
అఫ్గాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన మినీ వేలంలో ముబీబ్‌ను కేకేఆర్ రూ.2కోట్లకు కొనుగోలు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ తరుపున నవీన్, సన్ రైజర్స్ హైదరాబాద్ తరుపున ఫజల్‌హక్ లు ఆడుతున్నారు.
ఇదిలా ఉంటే.. అఫ్గానిస్తాన్ జనవరిలో భారతదేశంలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమ్ఇండియాతో అఫ్గానిస్తాన్ మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. తొలి టీ20 జనవరి 11న మొహాలీలో, రెండవ టీ20 జనవరి 14న ఇండోర్‌లో, మూడవ టీ20 జనవరి 17న బెంగళూరులో జరగనుంది.
KL Rahul : దక్షిణాఫ్రికా కామెడీ ఎర్రర్స్.. కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీకి ఎలా తోడ్పాయో తెలుసా..?