Sunil Gavaskar : 50 ఏళ్లుగా క్రికెట్ చూస్తున్నా.. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ పై గ‌వాస్క‌ర్ కామెంట్స్ వైర‌ల్‌

ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు కేఎల్ రాహుల్ చిర‌స్మ‌ర‌ణీయ ఇన్నింగ్స్ ఆడాడు.

Sunil Gavaskar : 50 ఏళ్లుగా క్రికెట్ చూస్తున్నా.. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ పై గ‌వాస్క‌ర్ కామెంట్స్ వైర‌ల్‌

Sunil Gavaskar - KL Rahul

Updated On : December 27, 2023 / 7:00 PM IST

Sunil Gavaskar – KL Rahul : ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు కేఎల్ రాహుల్ చిర‌స్మ‌ర‌ణీయ ఇన్నింగ్స్ ఆడాడు. సెంచూరియ‌న్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న తొలి టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో రాహుల్ 137 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 101 ప‌రుగులు చేశాడు. అత్యంత ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో అత‌డు ఈ సెంచ‌రీ చేశాడు. ఓ వైపు స‌హ‌చ‌రులు ఒక్కొక్క‌రుగా వెనుదిరుగుతున్నా.. మ‌రో వైపు అత‌డు గోడ‌లా నిలుచున్నాడు. చ‌రిత్ర‌లో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.

121 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన భార‌త జ‌ట్టును ఆదుకున్నాడు. లోయ‌ర్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ల సాయంతో మంచి భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్పుతూ టీమ్‌కు 245 ప‌రుగుల గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరును అందించాడు. కీల‌క స‌మ‌యంలో రాణించిన రాహుల్ పై ప్ర‌స్తుతం ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.

KL Rahul : దక్షిణాఫ్రికా కామెడీ ఎర్ర‌ర్స్‌.. కేఎల్ రాహుల్ అద్భుత సెంచ‌రీకి ఎలా తోడ్పాయో తెలుసా..?

రాహుల్ ఇన్నింగ్స్ ను భార‌త దిగ్గ‌జ సునీల్ గ‌వాస్క‌ర్ కొనియాడారు. ఈ మ్యాచ్‌కు కామెంటేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న గ‌వాస్క‌ర్ రాహుల్ సెంచ‌రీ చేయ‌గానే ఇలా అన్నాడు. తాను 50 ఏళ్లుగా క్రికెట్ ను చూస్తున్నాన‌ని, రాహుల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఖ‌చ్చితంగా భార‌త టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో టాప్‌-10ల‌లో ఒక‌టిగా నిలిచిపోతుంద‌ని అన్నాడు.

ప్ర‌ముఖ కామెంటేట‌ర్ హ‌ర్షా భోగ్లే సైతం రాహుల్ ఇన్నింగ్స్ ను మెచ్చుకున్నాడు. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. రాహుల్ త‌ల ఎత్తుకునే సెంచ‌రీ చేశారు. ఇత‌ను అత్యంత అరుదైన ప్లేయ‌ర్ అని హ‌ర్షా అన్నాడు.

KL Rahul : కేఎల్ రాహుల్ అరుదైన ఘ‌న‌త‌.. సెంచూరియ‌న్‌లో ఒకే ఒక్క‌డు


క్రికెట్ దేవుడు స‌చిన్ సైతం రాహుల్ ఇన్నింగ్స్ పై స్పందించారు. రాహుల్ కెరీర్‌లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పాడు. ‘రాహుల్ చాలా బాగా ఆడాడు. అత‌డి ఆలోచ‌నా విధానంలో స్ప‌ష్ట‌త బాగుంది. అత‌డి ఫుట్‌వ‌ర్క్ అద్భుతం. ఓ బ్యాటర్‌ సరైన మార్గంలో ఆలోచిస్తున్నప్పుడే ఇలాంటి ఇన్నింగ్స్‌ సాధ్యం. ఈ టెస్టు మ్యాచులో కేఎల్ సెంచ‌రీ ఎంతో కీల‌కం. నిన్నటి స్టేజ్‌ నుంచి భారత్‌ ఈ స్కోరు (245)తో కాస్తైనా సంతోషించి ఉంటుంది. నండ్రె బర్గర్‌, గెరాల్డ్‌ కొయెట్జ్ లు ద‌క్షిణాఫ్రికా బౌలింగ్‌కు అద‌న‌పు బ‌లాన్ని చేకూర్చారు.’ అని స‌చిన్ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చారు.

Gautam Gambhir : మిచెల్ స్టార్క్‌కు 24కోట్లు ఇప్పించారు.. నాకు ఓ రెండు కోట్లు ఇప్పించండ‌య్యా..