Neeraj Chopra: స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు ఇష్టమైన ఫుడ్ ఏమిటంటే?
టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో రజతం గెలిచిన మీరాబాయి చాను ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.

Neeraj
Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో రజతం గెలిచిన మీరాబాయి చాను ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరీ తర్వాత మహిళల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో పతకం సాధించిన రెండో మహిళగా మీరాబాయి రికార్డు క్రియేట్ చెయ్యగా.. దేశానికి సిల్వర్ అందించిన ఆమెపై ప్రశంసలతోపాటు అవార్డులు, రివార్డులు వరించాయి. డొమినోస్ పిజ్జా బంపర్ ఆఫర్ ఇచ్చి మీరాబాయికి పిజ్జా అంటే చాలా ఇష్టమట అంటూ పిజ్జాలు పంపింది.
ఇప్పుడు స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా విషయంలో కూడా ఏ ఫుడ్ అతనికి ఇష్టమైనది అనేది నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆటల్లో తానేంటో నిరూపించుకుని భారతదేశం పేరు, ప్రతిష్ఠలను తీసుకుని వచ్చిన నీరజ్ చోప్రాకు బ్రెడ్ అమ్లెట్ అన్నా, గోల్‌గప్పాలు లాగించడమన్నా చాలా ఇష్టమంట. అంతేకాదు.. స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు స్వీట్లు అంటే ప్రాణం.. తనకు ఇష్టమైన ఆహారాల గురించి ఒలింపిక్స్‌కు వెళ్లడానికి ముందు మీడియాతో పంచుకున్నాడు. తనకు బ్రెడ్ ఆమ్లెట్ తినడం ఎంతో ఇష్టమని, వారం రోజులు ఏ సమయంలోనైనా బ్రెడ్ ఆమ్లెట్ తినడానికి ఇష్టపడతానని చెప్పాడు.
టోర్నమెంట్ సమయాల్లో సలాడ్లు, పండ్లు తింటూ.. ప్రాక్టీస్ చేసే నీరజ్ చోప్రా.. పండ్లరసాలు ఎక్కువగా తీసుకుంటూ దేశంలో పోటీలకు హాజరవుతూ ఉంటారు. అక్కడ దొరికే ఆహారాలను తీసుకుంటూ ఉంటాడు. గోల్‌గప్పాలు తినడం అంటే అమితమైన ఇష్టమని, గోల్‌గప్పాలో ఎక్కువగా నీరే ఉంటుందని, అందువల్ల ఆటగాళ్లకు ఎలాంటి అపాయం ఉండదని వెల్లడించారు.