Ind vs Ban 2nd Test: రాహుల్ నువ్వు మారవా..! తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌కు ఓపెనర్లు.. ఆటాడుకుంటున్న నెటిజన్లు

సోషల్ మీడియా వేదికగా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ద్రవిడ్ స్పెషల్ గా నీకు పాఠాలు నేర్పినా నీ ఆటతీరులో మార్పురాదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. పనికిరాని రాహుల్ ను పక్కన పెట్టకుండా కెప్టెన్ ను చేశారు అంటూ మండిపడుతున్నారు.

Ind vs Ban 2nd Test: రాహుల్ నువ్వు మారవా..! తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌కు ఓపెనర్లు.. ఆటాడుకుంటున్న నెటిజన్లు

KL Rahual

Updated On : December 23, 2022 / 11:52 AM IST

IND vs BAN 2nd Test: రెండో టెస్టులో టీమిండియా బ్యాటింగ్‌లో తడబడుతోంది. భారత్ బౌలర్లు తమ అద్భుత ప్రదర్శనతో ఆతిధ్య జట్టు బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. తొలిరోజే కేవలం 227 పరుగులకే బంగ్లా బౌలర్లు ఆలౌట్ అయ్యారు. బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా తొలిరోజు 19 పరుగులు చేసింది. రెండోరోజు ఆటలో భాగంగా 19 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఎదురు‌దెబ్బ తగిలింది. వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (10) పరుగులకే ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. శుభ్‌మన్ గిల్ (20) ఎక్కువసేపు క్రిజ్‌లో నిలవలేక పోయాడు. దీంతో కేవలం 38 పరుగులకే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది.

 

 

రాహుల్ బ్యాటింగ్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బంగ్లా‌దేశ్ టూర్‌లో భాగంగా వన్డే సిరీస్‌లో రాహుల్ తొలి మ్యాచ్‌లో 73 మినహా మిగిలిన రెండు మ్యాచ్‌లలో కేవలం 14, 8 పరుగులకే అవుట్ అయ్యాడు. టెస్ట్ సిరీస్‌లోనూ రాణించలేక పోతున్నారు. ఈ క్రమంలో రెండో టెస్టు ఆరంభానికి ముందు కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేశాడు. కానీ క్రిజ్‌లో  మరోసారి విఫలమయ్యాడు.

సోషల్ మీడియా వేదికగా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ద్రవిడ్ స్పెషల్‌గా నీకు పాఠాలు నేర్పినా నీ ఆటతీరులో మార్పురాదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. పనికిరాని రాహుల్‌ను పక్కన పెట్టకుండా కెప్టెన్‌ను చేశారు. వన్డే, టెస్ట్ మ్యాచ్‌లలో అతని వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. అయినా బీసీసీఐ అతడిని కొనసాగిస్తుంది. అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. నీ స్థానంలో మరో బ్యాటర్ ఉంటే కచ్చితంగా జట్టు నుంచి తొలగించేవారు అంటూ నెటిజన్లు కేఎల్ రాహుల్ ఆటతీరుపై ట్రోల్ చేస్తున్నారు.