న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్.. కివీస్ తో టెస్టు ఫార్మాట్ కు సిద్ధమైంది. వెల్లింగ్టన్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మయాంక్ అగర్వాల్ తోడుగా పృథ్వీ షా ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.
వన్డే సిరీస్‌లో వైట్‌వాష్ అయిన భారత్.. టెస్టు ఫార్మాట్‌ను నిలబెట్టుకోవాలని చూస్తుంది. భారత్‌పై తీవ్రమైన ఒత్తిడి ఉండటంతో ఏ మేర నిలబెట్టుకుంటుందో చూడాలి. బలాబలాల్లో భారతే ఫేవరేట్ అయినప్పటికీ సొంతగడ్డపై ఆడుతుండడంతో పాటు వన్డే సిరీస్ విజయం న్యూజిలాండ్‌కు ప్రత్యేక ఉత్సాహాన్ని అందించింది. సానుకూలాంశం.
పరిమిత ఓవర్ల సిరీస్‌లలో చెరొకటి గెలిచి సమంగా నిలిచిన ఇరుజట్లు సంప్రదాయక ఆటలో అమీతుమి తేల్చుకోనున్నాయి. ఐదు టీ20ల సిరీస్‌ను కోహ్లీసేన 5-0తో క్లీన్ స్వీప్ చేయగా.. మూడు వన్డేల సిరీస్‌ను 0-3తో గెలుచుకొని కివీస్ బదులు తీర్చుకుంది. దీంతో రెండు టెస్ట్‌ల పోరు ఆసక్తికరంగా మారింది.
ఈ ఫార్మాట్‌లో న్యూజిలాండ్ గడ్డపై కోహ్లీ సేనకు మెరుగైన రికార్డు లేకపోయినప్పటికీ.. టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన అన్నీ మ్యాచ్‌ల్లో గెలిచిన ఉత్సాహంతో ఈ సిరీస్ కూడా నెగ్గి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది.
ఇరు జట్లు:
న్యూజిలాండ్:
Tom Latham, Tom Blundell, Kane Williamson (c), Ross Taylor, Henry Nicholls, BJ Watling (wk), Colin de Grandhomme, Kyle Jamieson, Tim Southee, Ajaz Patel, Trent Boult
టీమిండియా:
Prithvi Shaw, Mayank Agarwal, Cheteshwar Pujara, Virat Kohli (c), Ajinkya Rahane, Hanuma Vihari, Rishabh Pant (wk), Ravichandran Ashwin, Ishant Sharma, Mohammed Shami, Jasprit Bumrah