పంజాబ్ ఓడినా.. హాఫ్ సెంచరీ రికార్డ్ క్రియేట్ చేసిన పూరన్..

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL2020)లో ఆరంభం నుంచి పడుతూలేస్తూ సాగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్ నికోలస్ పూరన్ రాగానే ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచింది. యువ స్పిన్నర్ అబ్దుల్ సమద్ వేసిన తొమ్మిదో ఓవర్లో వరుసగా 6, 4, 6, 6, 6 బాది 28పరగులు స్కోరు బోర్డుకు యాడ్ చేశాడు పూరన్. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోయినా కూడా.. పూరన్ రికార్డు మాత్రం చెప్పుకోదగినదే.
నికోలస్ పూరన్.. 17 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో తన ఐపీఎల్ కెరీర్‌లో మొదటి హాఫ్‌సెంచరీ సాధించాడు. అంతేకాదు ఐపీఎల్-13వ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం కూడా చేశాడు. పంజాబ్ తరఫున వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. లోకేశ్ రాహుల్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. 2018లో ఢిల్లీపై 14 బంతుల్లో రాహుల్ అత్యంత వేగంగా 50పరుగులు పూర్తి చేశాడు.
ఐపీఎల్‌లో కరేబియన్ స్టార్ స్పిన్నర్ సునిల్ నరైన్ 15 బంతుల్లో అర్ధ సెంచరీ బాది రెండో స్థానంలో ఉండగా.. యూసుఫ్ పఠాన్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) 15 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టి నరైన్‌తో నరైన్‌తో పాటు రెండో స్థానంలో ఉన్నాడు. 16 బంతుల్లో 50పరుగులు చేసిన టీ20 స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా (చెన్నై సూపర్ కింగ్స్) మూడో ప్లేస్‌లో ఉన్నాడు.