Nitish Rana : ఐపీఎల్ ముగియ‌గానే కేకేఆర్ మాజీ ఆట‌గాడు నితీష్ రాణా కీల‌క నిర్ణ‌యం.. ‘చిన్న విరామం’..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాడు నితీష్ రాణా గురించి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌ని లేదు.

Nitish Rana Suddenly Announces Social Media Break After IPL 2025 Season

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాడు నితీష్ రాణా గురించి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆట‌తో పాటు సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటాడు. త‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను అభిమానుల‌తో పంచుకుంటూ ఉంటాడు. కాగా.. సోష‌ల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నాను అంటూ శ‌నివారం త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. స‌డెన్‌గా అత‌డు ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నాడు అని సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది.

దీని వెనుక చాలా కార‌ణాలు ఉన్నాయ‌ని ప‌లువురు అంటున్నారు. ఇటీవ‌ల అత‌డి భార్య సాచి రాణా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ సీఈఓ పై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపిన సంగ‌తి తెలిసిందే. ఇది కూడా ఓ కార‌ణ‌మై ఉంటుంద‌ని అంటున్నారు.

Brandon McMullen : క‌పిల్ దేవ్‌, స్టీవ్ వా, ష‌కీబ్‌ల రికార్డుల‌ను బ్రేక్ చేసిన స్కాట్లాండ్ ఆల్‌రౌండ‌ర్‌..

ఇదిలా ఉంటే.. అత‌డు త్వ‌ర‌లోనే తండ్రి కాబోతున్నాడు. ప్ర‌స్తుతం అత‌డి భార్య గ‌ర్భ‌వ‌తి. ఈ క్ర‌మంలో కుటుంబానికి స‌మ‌యం కేటాయించేందుకే రాణా ఈ నిర్ణ‌యం తీసుకుని ఉంటాడ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.

ENG vs IND : భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆటగాళ్లు వీరే..

ఇక ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో రాణా ఆశించిన స్థాయిలో రాణించ‌లేదు. 11 మ్యాచ్‌లు ఆడిన అత‌డు 161.94స్ట్రైక్‌రేటుతో 217 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. కేకేఆర్ త‌రుపున కొన్ని సీజ‌న్లు ఆడిన నితీష్ రాణా ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 4.20 కోట్ల‌కు కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే.