Brandon McMullen : కపిల్ దేవ్, స్టీవ్ వా, షకీబ్‌ల రికార్డులను బ్రేక్ చేసిన స్కాట్లాండ్ ఆల్‌రౌండర్..
స్కాట్లాండ్‌కు చెందిన బ్రాండన్ మెక్‌ముల్లెన్ అరుదైన ఘనత సాధించాడు.

Scottish Star Brandon McMullen surpasses kapil dev and steve waugh to massive ODI milestone
స్కాట్లాండ్‌కు చెందిన బ్రాండన్ మెక్‌ముల్లెన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేయడంతో పాటు 50 వికెట్లు పడగొట్టిన రెండో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఐసీసీ మెన్స్ క్రికెట్ వన్డే ప్రపంచకప్ లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు.
ఈ స్కాట్లాండ్ ఆల్‌రౌండర్ 33వ వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకోవడం విశేషం. ఈ క్రమంలో దిగ్గజ ఆల్‌రౌండర్లు కపిల్ దేవ్, లాన్స్ క్లూసెనర్, స్టీవ్‌వా, షకీబ్ అల్ హసన్ లను బ్రాండన్ మెక్‌ముల్లెన్ అధిగమించాడు. ఈ జాబితాలో నెదర్లాండ్స్ కు చెందిన ర్యాన్ టెన్ డెష్కాట్ తొలి స్థానంలో ఉన్నాడు. అతడు 25 వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు 50 వికెట్లు తీసిన ఆటగాళ్లు వీరే..
ర్యాన్ టెన్ డెష్కాట్ (నెదర్లాండ్స్) – 25 ఇన్నింగ్స్‌లు
బ్రాండన్ మెక్‌ముల్లెన్ (స్కాట్లాండ్) – 33 ఇన్నింగ్స్‌లు
లాన్స్ క్లూసెనర్ (దక్షిణాఫ్రికా) – 42 ఇన్నింగ్స్‌లు
కపిల్ దేవ్ (భారత్) – 46 ఇన్నింగ్స్‌లు
స్టీవ్ వా (ఆస్ట్రేలియా) – 46 ఇన్నింగ్స్‌లు
షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 50 ఇన్నింగ్స్‌లు
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో మెక్ ముల్లెన్ తన 10 ఓవర్ల కోటాలో 40 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. స్కాటిష్ బ్యాటర్లో ఫిన్లే మెక్‌క్రీత్ (81), మార్క్ వాట్ (60) లు హాఫ్ సెంచరీలు చేశారు. ఆ తరువాత లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 45 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది.