ఇదేం బాల్ బాబూ..: పిచ్‌పైన పడకపోయినా లీగల్ డెలీవరీయా?

క్రికెట్ ఫీల్డ్‌లో జరిగే గమ్మత్తులు విచిత్రంగా అనిపిస్తాయి. సాధారణంగా ప్రతి బంతిని బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయాలనే విసురుతాడు బౌలర్. వాటిన సమర్థంగా ఎదుర్కొంటూ బౌండరీలకు పంపిస్తే.. కొన్ని సార్లు తడబడి వికెట్ కోల్పోతారు. వాటికి విరుద్ధంగా అస్సలు బ్యాట్స్‌మన్‌కు సంబంధం లేకుండా బౌలింగ్ చేస్తే.. కేవలం బౌలర్, కీపర్ మధ్యనే బాల్ ఆడుకుంటుంటే ఎలా ఉంటుంది. ఆస్ట్రేలియా దేశీ వాలీ లీగ్ లో జరిగిన ఈ ఘటన నెట్టింట్లో హల్‍చల్ చేస్తోంది.
ఆస్ట్రేలియా ఫస్ల్ క్లాస్ క్రికెట్ కాంపిటీషన్ అయిన షెఫీల్డ్ షీల్డ్‌లో విక్టోరియా, క్వీన్స్‌ల్యాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. అందులో క్వీన్స్‌ల్యాండ్ జట్టు తరపున ఆడుతోన్న లెగ్ స్పిన్నర్ మిచెల్ స్వెప్‌సన్ బౌలింగ్ చేశాడు. అయితే అందులో ఓ బాల్‌ను పిచ్‌కు సంబంధం లేకుండా విసిరినా అంపైర్ దానిని లీగల్ డెలివరీగా ప్రకటించాడు. దాంతో కామెంటేటర్లు కూడా కాసేపటికి వరకూ షాక్ గురయ్యారు.
Also Read:మనోళ్లే గెలిచారు: షూటింగ్‌లో మనూ.. సౌరబ్‌లకు గోల్డ్
ఆ తర్వాత వారిలో వారే మాట్లాడుకుంటూ అంపైర్ పైన విమర్శిస్తున్న మాటలు బయటికే వినిపించాయి. ‘అది గ్రౌండ్‌లో పడింది కానీ, అది నో బాల్. పిచ్ మీద పడలేదు. రిటర్న్ క్రీజుకు బయట బాల్ పడింది. అందులో గందరగోళమేమీ లేదు. క్లియర్ గా కనిపిస్తుంది. అది నో బాల్. మరెందుకు అంపైర్ దానిని వదిలేశాడో అర్థం కావట్లేదు. అది ఓ ప్రాక్టీసు బాల్ అనుకుంటున్నా’ అని మాట్లాడుకుంటున్న మాటలు వినిపించడంతో స్టేడియంలో ఉన్నవాళ్లంతా అంపైర్‌ను చూసి నవ్వుకున్నారు.
“That did not land on the pitch” ? #SheffieldShield pic.twitter.com/UaTBNugsWP
— cricket.com.au (@cricketcomau) February 26, 2019