VVS Laxman : గౌతమ్ గంభీర్ కానే కాదు.. ఆసియా క్రీడలకు భారత హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. కేంద్రం ఆమోదం..
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల క్రికెట్ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
Not Gautam Gambhir, VVS Laxman To Coach Indian Men's Cricket Team At Asian Games
VVS Laxman : జపాన్‌లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 24 నుంచి ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రీడల్లో టీమ్ఇండియా నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. ఇప్పటికే ఈ క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే.. ఈ జట్టుతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వెళ్లడం లేదు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) క్రికెట్ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ టీమ్‌కు కోచ్‌గా వెళ్లనున్నాడు.
క్రీడా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కోచ్‌ల జాబితా ప్రకారం.. లక్ష్మణ్‌కు సునీల్ జోషి , హృషికేష్ కనిత్కర్, సుభదీప్ ఘోష్ సహాయకులుగా ఉంటారు. గతంలో చైనాలోని హాంగ్జౌలో జరిగిన 2023 ఆసియా క్రీడల్లో కూడా లక్ష్మణ్ భారత పురుషుల జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. ఆ క్రీడల్లో భారత్ స్వర్ణ పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే.
టీమ్ఇండియా రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌కు సీనియర్ జట్టుతో పాటు ఉండనున్నారు. మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్ సెప్టెంబర్ 27న ప్రారంభం కానుంది.
అమోల్ ముజుందార్ భారత మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా ఉండనుండగా, ఆయనకు బౌలింగ్ కోచ్ ఆవిష్కర్ సాల్వీ , ఫీల్డింగ్ కోచ్ మునీష్ బాలి సహాయకులుగా ఉంటారు.
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత పురుషుల జట్టు ఆసియా గేమ్స్‌లో బరిలోకి దిగనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత మహిళల జట్టు ఆడనుంది.
2026 ఆసియా క్రీడలకు భారత క్రికెట్ జట్లు ఇవే..
భారత పురుషుల క్రికెట్ జట్టు.. శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ.
భారత మహిళా క్రికెట్ జట్టు.. హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, దీప్తి శర్మ, రిచా ఘోష్, కమలిని, భారతీ ఫుల్మాలి , శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతీ రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, నందని శర్మ,
