NZ vs SA : కివీస్ బౌలర్ల ధాటికి కుదేలైన సఫారీ బ్యాటర్లు.. న్యూజిలాండ్ ముందు స్వల్ప లక్ష్యం
న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి అక్లాండ్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు (NZ vs SA ) తక్కువ స్కోరుకే పరిమితమైంది.
NZ vs SA 3rd T20 New Zealand Target is 137
NZ vs SA : న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి అక్లాండ్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 137 పరుగుల లక్ష్యం నిలిచింది.
సఫారీ బ్యాటర్లలో న్కోబాని మోకోయెనా (26 నాటౌట్; 20 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) జార్జ్ లిండే (23; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. వియాన్ ముల్డర్ డకౌట్ కాగా.. టోనీ డి జోర్జీ (15), కానర్ ఎస్టర్హుయిజెన్ (15), జాసన్ స్మిత్ (10)లు విఫలం అయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జేమీసన్, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. లాకీ ఫెర్గూసన్, కోల్ మెక్కాంచీ, జేమ్స్ నీషమ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
SRH : అయ్యో.. కావ్య పాపకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ ఆసీస్ ఆటగాళ్లు ఉన్నారే..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా ఓ దశలో 68 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కనీసం వంద పరుగులు అయినా దాటుతుందా అన్న సందేహం కలిగింది. అయితే.. లిండే, న్కోబాని మోకోయెనా లు రాణించడంతో 100 పరుగులను దాటింది.
