ODI World Cup 2023 : వరల్డ్ కప్ లో శ్రీలంక చెత్త ప్రదర్శనకు జైషానే కారణమట.. అర్జున్ రణతుంగ సంచలన వ్యాఖ్యలు

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షా శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) అధికారులపై ప్రభావం చూపుతున్నారని, అందుకే వన్డే వరల్డ్ కప్ 2023లో శ్రీలంక ఘోర ఓటమి పాలైందని అర్జున్ రణతుంగ విమర్శించారు.

Arjuna Ranatunga : ఇండియా వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కొనసాగుతోంది. లీగ్ మ్యాచ్ లు పూర్తికాగా ఈనెల 15న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మెగాటోర్నీలో శ్రీలంక జట్టు ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఆ జట్టు ఆడిన తొమ్మిది మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. దీనికితోడు 2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హతను సాధించడంలోనూ విఫలమైంది. శ్రీలంక ఘోర ఓటమి పట్ల ఆ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read : Visakha : విశాఖ‌లో భార‌త్‌, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌.. 15 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షా శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) అధికారులపై ప్రభావం చూపుతున్నారని, అందుకే వన్డే వరల్డ్ కప్ 2023లో శ్రీలంక ఘోర ఓటమి పాలైందని అర్జున్ రణతుంగ ఆరోపించారు. శ్రీలంక క్రికెట్ ను జైషా నడుపుతున్నాడు. జైషా ఒత్తిడితో శ్రీలంక క్రికెట్ బోర్డును నాశనం చేస్తోందని, ఓ భారతీయుడు శ్రీలంక క్రికెట్ ను నాశనం చేస్తున్నాడని రణతుంగ తీవ్రస్థాయిలో ఆరోపించాడు. ఆయన ఆరోపణలపై బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ బోర్డు ఇంకా స్పందించలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ సంస్థలపై బీసీసీఐ ఆధిపత్యం చెలాయించాలని చూస్తుందని రణతుంగ గతంలో పలుసార్లు ఆరోపించారు.

Also Read : Video Viral : ప్రముఖ క్రికెటర్ ముంబయిలోని రోడ్‌సైడ్ బార్బర్ షాప్‌లో కటింగ్…వీడియో వైరల్

ప్రపంచ కప్ లో శ్రీలంక పేలవమైన ప్రదర్శన కారణంగా ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింగ్ నవంబర్ 6న శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేశారు. మధ్యంతర బోర్డునుకూడా ఏర్పాటు చేశారు. తాత్కాలిక బోర్డు కొత్త చైర్మన్ గా అర్జున్ రణతుంగ నియమితులయ్యారు. అంతేకాక శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేయాలని కేంద్ర క్రీడల మంత్రి ఐసీసీకి లేఖ రాశారు. ఈనెల 10న శ్రీలంక క్రికెట్ బోర్డు ఐసీసీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు