Ind Vs Pak: రామ్ చరణ్-ఎన్టీఆర్ ఫొటోను పోస్ట్ చేసి.. క్రికెట్ గురించి స్విగ్గీ ఏం చెప్పిందో తెలుసా?

చికెన్ బిర్యానీ తింటూ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూస్తుంటే ఆ మజాయే వేరు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన శనివారం రోజు..

Ind Vs Pak: రామ్ చరణ్-ఎన్టీఆర్ ఫొటోను పోస్ట్ చేసి.. క్రికెట్ గురించి స్విగ్గీ ఏం చెప్పిందో తెలుసా?

Biryanis On Swiggy

Updated On : October 15, 2023 / 8:44 PM IST

Biryanis On Swiggy: ప్రపంచ కప్ మ్యాచుల వేళ క్రికెట్ ప్రేమికులు టీవీలు, హాట్ స్టార్ ఓటీటీకి అతుక్కుపోయి కూర్చుంటున్నారు. ఇక భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే కూర్చున్న చోటు నుంచి లేవకుండా చూస్తుంటారు. ఇంట్లో ఏ పనీ చేయరు. కనీసం ఆహారం వండుకోరు. స్విగ్గీ వంటి యాప్‌లలో ఆర్డర్లు ఇస్తుంటారు.

చికెన్ బిర్యానీ తింటూ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూస్తుంటే ఆ మజాయే వేరు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన శనివారం రోజు స్విగ్గీకి ఎన్ని బిర్యానీ ఆర్డర్లు వచ్చాయో తెలుసా? నిమిషానికి 250. బిర్యానీ ఆర్డర్లతో స్విగ్గీ మరింత బిజీ అయిపోయింది. శనివారం ఆన్‭లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లలో జోరు మొత్తం చికెన్ బిర్యానీలదే.

ఛత్తీస్‌గఢ్‌లోని ఓ కుటుంబం శనివారం మ్యాచ్ చూస్తూ ఏకంగా 70 ఆర్డర్లు ఇచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ స్విగ్గీ ట్వీట్ చేసింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ బిర్యానీ తినే ఫొటోను ఈ సందర్భంగా స్విగ్గీ పోస్ట్ చేసింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే భారతీయులకు ఎంత ఇష్టమో బిర్యానీ అంటే కూడా అంతే ఇష్టం.. ఇక ఈ రెండింటి కాంబినేషన్లో వచ్చిన రోజుని ఎలా వదులుకుంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Rohit Sharma : నా కండ‌లు చూశావా..? అంపైర్‌తో రోహిత్ శ‌ర్మ‌.. వీడియో వైర‌ల్