CWC 2023: వన్డే ప్రపంచకప్.. టాప్ 5 బ్యాటర్లు, బౌలర్లు వీరే.. అశ్విన్ ఆడింది ఒక్క మ్యాచ్.. కానీ
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో లీగ్ మ్యాచుల్లో టీమిండియా దుమ్మురేపింది. వరుస విజయాలతో టాపర్ గా నిలిచింది. టీమిండియా ప్లేయర్లు కూడా పలు విభాగాల్లో ముందున్నారు.

ODI world cup 2023 most run scorers wicket takers and other stats after league stage
ODI World Cup 2023 : ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో లీగ్ దశ ముగిసింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా వరుసగా 9 మ్యాచుల్లో గెలిచి టాపర్ గా నిలిచింది. ఈనెల 15న జరిగే ఫస్ట్ సెమీస్ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ తో తలపడనుంది. అంచనాలకు తగినట్టు సత్తా చాటి లీగ్ దశలో దుమ్మురేపింది. బ్యాటింగ్, బౌలింగ్ లో సమిష్టిగా రాణించి వరుస విజయాలు అందుకుంది. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ పలు ఘనత సాధించారు. బౌలర్లలో మహ్మద్ షమి, బుమ్రా, జడేజా, కుల్దీప్ యాదవ్ కూడా కీలక పాత్ర పోషించారు.

Virat Kohli
విరాట్ కోహ్లి టాప్
విరాట్ కోహ్లి 594 పరుగులతో టాప్ రన్నర్ గా కొనసాగుతున్నాడు. 503 పరుగులతో రోహిత్ శర్మ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు. సౌతాఫ్రికా ఓపెనర్ డికాక్, న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర, డేవిడ్ వార్నర్ కూడా టాప్ ప్లేస్ కోసం పోటీ ఉన్నారు. చివరికి ఎవరు టాప్ రన్నర్ గా నిలుస్తారో చూడాలి. అత్యధిక సెంచరీలు కొట్టిన బ్యాటర్ల లిస్టులో క్వింటన్ డికాక్ (4), రచిన్ రవీంద్ర (3) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. విరాట్ కోహ్లి, డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, మిచెల్ మార్ష్ రెండేసి సెంచరీలు సాధించారు.
టాప్ 5 రన్నర్లు
1. విరాట్ కోహ్లి (594)
2. క్వింటన్ డికాక్ (591)
3. రచిన్ రవీంద్ర (565)
4. రోహిత్ శర్మ (503)
5. డేవిడ్ వార్నర్ (499)

Team India
టాప్ 20లో టీమిండియా బౌలర్లు
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ టాప్ 10లో ఉన్నారు. సైమీఫైనల్ మ్యాచ్ లో సత్తా చాటితే వీరిద్దరూ మరింత ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. బుమ్రా 6, షమీ 7 స్థానాల్లో కొనసాగుతున్నారు. 9 మ్యాచుల్లో బుమ్రా 17 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీ 5 మ్యాచుల్లోనే 16 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా 11వ స్థానంలో ఉన్నాడు. కుల్దీప్ 14, మహ్మద్ సిరాజ్ 19 ప్లేసుల్లో కంటిన్యు అవుతున్నారు. మొత్తంగా చూస్తే టీమిండియా ఐదుగురు బౌలర్లు టాప్ 20లో ఉన్నారు.
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
1. ఆడమ్ జంపా (22)
2. దిల్షాన్ మధుశంక(21)
3. షహీన్ ఆఫ్రిది (18)
4. గెరాల్డ్ కోయెట్జీ (18)
5. మార్కో జాన్సెన్ (17)
టాప్ లో అశ్విన్!
బ్యాటింగ్ యావరేజ్ లో కోహ్లి (99 శాతం), బౌలింగ్ యావరేజ్ లో షమీ (9.56 శాతం) టాప్ లో ఉన్నారు. 15.64 శాతంతో బుమ్రా సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. మోస్ట్ ఎకనామికల్ బౌలర్ల లిస్టులో టాప్ 5లో నలుగురు టీమిండియా ప్లేయర్సే ఉన్నారు. ఒక్క మ్యాచ్ ఆడిన అశ్విన్ టాప్ లో ఉన్నాడు. బుమ్రా, జడేజా, కుల్దీప్ యాదవ్ మిగతా ఆటగాళ్లు. కోహ్లి ఇప్పటివరకు అత్యధిక హాఫ్ సెంచరీలు (5) చేసి ఈ కేటగిరిలో టాప్ లో ఉన్నాడు. బౌండరీల్లో రోహిత్ శర్మ అందరి కంటే ముందున్నాడు. ఇప్పటివరకు 24 సిక్సర్లు, 58 ఫోర్లు బాదాడు.
Also Read: వన్డే ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఒకే ఒక్క భారతీయుడు
అత్యధిక సార్లు 5 వికెట్లు పగొట్టిన బౌలర్లు
1. మహ్మద్ షమీ(2)
2. దిల్షాన్ మధుశంక(1)
3. మిచెల్ సాంట్నర్ (1)
4. రవీంద్ర జడేజా (1)
5. షహీన్ ఆఫ్రిది (1)
Also Read: కేఎల్ రాహుల్ పై పాక్ మాజీ కెప్టెన్లు అక్రమ్, మలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు
అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్లు
1. గ్లెన్ మాక్స్‌వెల్ 201*
2. మిచెల్ మార్ష్ 177*
3. క్వింటన్ డికాక్ 174
4. డేవిడ్ వార్నర్ 163
5. డెవాన్ కాన్వే 152*