Shubhman Gill : గిల్ వచ్చేశాడు..! అహ్మదాబాద్ కు చేరుకున్న యువ ప్లేయర్.. పాక్‌తో మ్యాచ్‌కు బరిలోకి?
వరల్డ్ కప్ లో భాగంగా ఇప్పటికే భారత్ జట్టు ఆస్ట్రేలియా, ఆప్గానిస్థాన్ జట్లతో మ్యాచ్ లు ఆడింది. ఈ రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్ లలో ఓపెనర్ గిల్ అందుబాటులో లేడు. డెంగీ జ్వరం కారణంగా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు.

Shubhman Gill
ODI World Cup 2023 Shubman Gill : టీమిండియా యువ ప్లేయర్ శుభ్ మన్ గిల్ జట్టులోకి తిరిగి చేరబోతున్నాడా? ఈనెల 14న జరిగే పాకిస్థాన్ – భారత్ మ్యాచ్ లో ఆడుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంకుతోడు, ప్లెట్లెట్స్ పడిపోవటంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. అయితే, చికిత్స అంనంతరం అతను చెన్నైలోని హోటల్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. గిల్ కు ప్లెట్లెట్స్ పడిపోవటంతో వచ్చే వరల్డ్ కప్ మ్యాచ్ లకు కూడా అందుబాటులో ఉండడని వార్తలు వచ్చాయి. తాజాగా గిల్ మళ్లీ జట్టులో చేరబోతున్నట్లు తెలుస్తోంది.
Read Also: మీరు ఎవరి రికార్డును బద్దలు కొట్టారు..? రోహిత్ శర్మ ఏం చెప్పాడో తెలుసా?
ప్లెట్లెట్స్ మెరుగవ్వటంతో పాటు జ్వరం కూడా తగ్గడంతో గిల్ కోలుకున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో అహ్మదాబాద్ కు గిల్ చేరుకున్నాడు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్తున్న శుభ్ మన్ గిల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈనెల 14న పాక్ తో మ్యాచ్ ఆడేందుకే గిల్ అహ్మదాబాద్ కు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, బీసీసీఐ వర్గాల నుంచి ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేదు. పాక్ తో మ్యాచ్ కు మరో రోజు సమయం ఉన్న నేపథ్యంలో గిల్ పూర్తిగా కోలుకుంటాడని, తుది జట్టులో చేరతాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వరల్డ్ కప్ లో భాగంగా ఇప్పటికే భారత్ జట్టు ఆస్ట్రేలియా, ఆప్గానిస్థాన్ జట్లతో మ్యాచ్ లు ఆడింది. ఈ రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్ లలో ఓపెనర్ గిల్ అందుబాటులో లేడు. డెంగీ జ్వరం కారణంగా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. గిల్ ప్లేస్ లో ఇషాంత్ కిషన్ ఓపెనర్ గా బరిలోకి దిగాడు. మొదటి మ్యాచ్ లో ఇషాంత్ కిషన్ డకౌట్ అయినా.. బుధవారం జరిగిన ఆఫ్గాన్ మ్యాచ్ లో పర్వాలేదనిపించాడు. తాజాగా గిల్ అహ్మదాబాద్ చేరుకోవటంతో.. ఇషాంత్ ప్లేస్ లో మళ్లీ గిల్ తిరిగి జట్టులోకి చేరుతాడని తెలుస్తోంది.