Steve Smith : అఫ్గానిస్థాన్తో మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ .. మరో ప్లేయర్ ఔట్?
ఆస్ట్రేలియా జట్టు ప్లేయర్స్ ను గాయాల బెడద వేదిస్తోంది. ఇప్పటికే ఇద్దరు కీలక ప్లేయర్స్ మ్యాచ్ కు దూరంకాగా.. తాజాగా ఆ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది.

Steve Smith
ICC World Cup 2023 AUS vs AFG Match : భారత్ గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో ఇవాళ (మంగళవారం) కీలక మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా జట్టుతో అఫ్గానిస్థాన్ జట్టు తలపడనుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ముఖ్యంగా అఫ్గాన్ జట్టు ఈ మ్యాచ్ లో ఓడితే ఆ జట్టుకు సెమీస్ ఆశలు దాదాపు గల్లంతయినట్లే. ఇరు జట్లలో ఆస్ట్రేలియా జట్టు బలంగా ఉంది. అయితే, ఆ జట్టు ప్లేయర్స్ ను గాయాల బెడద వేదిస్తోంది. ఇప్పటికే ఇద్దరు కీలక ప్లేయర్స్ మ్యాచ్ కు దూరంకాగా.. తాజాగా ఆ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా జట్టు ప్లేయర్ మాక్స్ వెల్ గాయం కారణంగా ఇంగ్లాండ్ తో చివరి మ్యాచ్ ఆడలేక పోయాడు. మరో ప్లేయర్ మిచెల్ మార్ష్ వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వెళ్లారు. తాజాగా ఆసీస్ జట్టు ప్లేయర్ స్టీవ్ స్మిత్ వర్టిగో తో బాధపడుతున్నట్లు తెలిపారు. దీంతో అఫ్గాన్ తో మ్యాచ్ కు స్మిత్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. స్టీవ్ స్మిత్ ఈ విషయంపై మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా నాకు కొద్దిగా తలతిరుగుతున్నట్లు అనిపిస్తోందని తెలిపాడు. అదికాస్త కలవరపెడుతోందని, అప్గాన్ తో మ్యాచ్ సమయానికి నేను మంచిగా ఉండగలనని ఆశిస్తున్నానని స్మిత్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ఈ కారణంగా ప్రాక్టీస్ కూడా చేయలేక పోయాను. అయితే, ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నా.. మ్యాచ్ సమయానికి పరిస్థితి అనుకూలంగా ఉంటే తుది జట్టులో ఉంటానని స్మిత్ చెప్పాడు.
Also Read : Sachin Tendulkar prediction : 11 ఏళ్ల క్రితం సచిన్ చెప్పిందే నిజమైంది.. వీడియో వైరల్
నవంబర్ 2020లో సిడ్నీలో జరిగిన వన్డే మ్యాచ్ లో స్మిత్ వర్టిగో ను అధిగమించి భారత్ పై సెంచరీ చేశాడు. గతేడాది కూడా పాకిస్థాన్ లో టెస్టు పర్యటనకు ముందు క్యాచ్ కు ప్రయత్నించినప్పుడు తలకు తగిలిన తరువాత స్మిత్ ఇలాంటి లక్షణలతో బాధపడుతున్నట్లు తెలిపాడు. అయితే, స్మిత్ సోమవారం నెట్స్ లో కొద్దిసేపు మాత్రమే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆస్ట్రేలియా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అఫ్గాన్ జట్టుపై విజయం సాధిస్తే ఆ జట్టు సెమీ ఫైనల్ కు వెళ్తుంది.