మీకు తెలుసా: 1983 టీమిండియా ప్లేయర్ల ఫీజు రూ.2వేలు, కోహ్లీకి రూ.7కోట్లు

కొద్ది రోజుల క్రితం బీసీసీఐ టీమిండియా ప్లేయర్ల కాంట్రాక్ట్ విడుదల చేసింది. ఏ ప్లస్ కేటగిరీ నుంచి సీ కేటగిరీ వరకూ ప్లేయర్లను విడగొట్టి రూ.కోటి నుంచి ఏడు కోట్ల రూపాయల వరకూ కేటాయించింది. బిగ్ బొనాంజాగా మారిన నేటి క్రికెట్.. ఒకప్పుడు మనుగడకే ఎంతకష్టమయ్యేదో తెలుసా.. టీంలో మ్యాచ్ కెప్టెన్ ఫీజే రూ.2100 అంటే ఆశ్చర్యంగా అనిపించడం లేదు.
ఓ సారి వరల్డ్ కప్ 1983లోకి వెళ్తే:
భారత క్రికెట్ ప్రస్థానంలో సంచలన ప్లేయర్ కపిల్‌దేవ్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అమోఘమైన విజయాన్ని సాధించి 1983 ప్రపంచకప్ భారత్‌ను గెలిపించాడు. ఏమాత్రం అంచనాల్లేని టీమిండియా ఏకంగా విశ్వవిజేతగా నిలిచింది. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.
1983వరల్డ్ కప్ టీం ప్లేయర్ల వేతనాలు ఎంతో తెలుసా:
* కపిల్ దేవ్ (కెప్టెన్)
* మోహిందర్ అమర్‌నాథ్ (వైస్ కెప్టెన్)
* సునీల్ గవాస్కర్
* కే శ్రీకాంత్
* యశ్‌పాల్ శర్మ
* సందీప్ పాటిల్
* కీర్తి ఆజాద్
* రోజర్ బిన్నీ
* మదన్ లాల్
* సయ్యద్ కిర్మణీ
* బీ సంధూ
* దిలీప్ వెంగ్‌సర్కార్
* రవి శాస్త్రి
* సునీల్ వాల్సన్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఏటా A, A+, B, C కేటగిరీలో సెంట్రల్ కాంట్రాక్ట్‌ని ఇస్తుంటుంది. తాజాగా 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబరు మధ్యకాలానికి సంబంధించిన కాంట్రాక్ట్‌ని బీసీసీఐ ప్రకటించింది.
=> A+ కేటగిరీలో రూ. 7 కోట్లు
కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా
=> A కేటగిరీలో రూ. 5.కోట్లు
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్‌లు
=> B కేటగిరీలో రూ. 3 కోట్లు
స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, సాహా, ఉమేశ్ యాదవ్, మయాంక్ అగర్వాల్, చాహల్
=> C కేటగిరిలో రూ. కోటి
ఫాస్ట్ బౌలర్ నవదీప్ షైనీ, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, కేదార్ జాదవ్, దీపక్ చాహర్, మనీశ్ పాండే, హనుమ విహారి, శార్ధూల్ ఠాకూర్‌లు