Pakistan Defeated: పాకిస్తాన్ మరో ఘోర పరాజయం.. దెబ్బ మీద దెబ్బ.. ఆ జట్టు చేతిలోనూ తప్పని ఓటమి..

Courtesy @ ESPNCricinfo
Pakistan Defeated: మెన్స్ ఆసియా కప్ 2025లో భారత్ చేతిలో పాకిస్తాన్ జట్టు ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో మూడు సార్లు పాక్ ను భారత్ ఓడించింది. ఫైనల్లో పాక్ ను మట్టికరిపించి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఇది పాక్ కు ఘోర పరాజయం అనే చెప్పాలి. అందులోంచి కోలుకోకముందే పాకిస్తాన్ కు మరో ఘోర పరాజయం ఎదురైంది. బంగ్లాదేశ్ చేతిలోనూ ఓటమి పాలైంది.
ఉమెన్స్ వరల్డ్ కప్ లో పాక్ కు బంగ్లాదేశ్ జట్టు బిగ్ షాక్ ఇచ్చింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పాక్ ఓటమిపాలైంది. 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 129 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 130 పరుగుల టార్గెట్ ను బంగ్లా జట్టు 31.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. మెన్స్ ఆసియా కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన పాక్ కు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లైంది.
ఉమెన్స్ మ్యాచ్ లో బంగ్లా బౌలర్లు చెలరేగారు. పాక్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. 67 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పాక్.. 129 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. బంగ్లా బౌలర్లలో మరుఫా అక్తర్, నాహిది అక్తర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. పాక్ జట్టులో హయ్యస్ట్ స్కోర్ 23 పరుగులే. ఇద్దరు డకౌట్ అయ్యారు.
బంగ్లా జట్టులో రూబ్యా హైదర్ హాఫ్ సెంచరీతో మెరిసింది. 77 బంతుల్లో 54 పరుగులు చేసి జట్టుకి విజయాన్ని అందించింది. కెప్టెన్ సుల్తానా (23), శోభన (24) పరుగులు చేసి జట్టుకి విజయాన్ని అందించారు.