IND vs WI Test : ఇలాంటి బంతులేస్తే ఆడేదెలా భయ్యా.. బూమ్రా దెబ్బకు ఎగిరిపడిన వికెట్లు.. పాపం.. వెస్టిండీస్ బ్యాటర్ ఫేస్ చూడాలి.. వీడియో వైరల్

IND vs WI Test టీమిండియా బౌలర్లు జస్ర్పీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లు నిప్పులు చెరిగే బంతులతో వెస్టిండీస్ బ్యాటర్లు టపటపా వికెట్లు కోల్పోయారు.

IND vs WI Test : ఇలాంటి బంతులేస్తే ఆడేదెలా భయ్యా.. బూమ్రా దెబ్బకు ఎగిరిపడిన వికెట్లు.. పాపం.. వెస్టిండీస్ బ్యాటర్ ఫేస్ చూడాలి.. వీడియో వైరల్

IND vs WI Test

Updated On : October 2, 2025 / 2:34 PM IST

IND vs WI Test : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆ జట్టుకు ఊహించని పరిణామం ఎదురైంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్లు జస్ర్పీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లు నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిపోవడంతో వెస్టిండీస్ బ్యాటర్లు హడలెత్తిపోయారు. దీంతో తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యారు.

మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు 44 ఓవర్లలో 162 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాటర్లలో జస్టిన్ గ్రీవ్స్ (32), షై హోప్ (26), రోస్టన్ చేజ్ (24) మినహా మిగిలిన బ్యాటర్లు చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. మిగతా బ్యాటర్లంతా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు.

Also Read: Pakistan Cricket: ఇండియాపై మూడుసార్లు ఓడిపోయారు.. సిగ్గు లేదు.. మళ్లీ మీకు… ప్లేయర్లపై భారీ రివేంజ్ తీర్చుకున్న పాక్ క్రికెట్ బోర్డు

టీమిండియా బౌలర్లు జస్ర్పీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లు నిప్పులు చెరిగే బంతులు వేయడంతో కరేబియన్ జట్టు బ్యాటర్లు వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టారు. సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. జస్ర్పీత్ బుమ్రా మూడు వికెట్లు తీశాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ పడగొట్టాడు. జస్టిన్ గ్రీవ్స్ క్రీజులో ఉన్న సమయంలో జస్ర్పీత్ బుమ్రా వేసిన యార్కర్ కు వికెట్లు ఎగిరిపడ్డాయి. దీంతో గ్రీవ్స్ బాల్ వికెట్లను ఎలా తాకిందో అర్ధంకాక క్షణాలపాటు అలాచూస్తూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.


మరోవైపు.. కుల్‌దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో షాయ్ హోప్‌ను బోల్తా కొట్టించాడు. అద్భుతమైన బంతితో హోప్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.