Arshad Nadeem : వివాదంలో పాక్ ఒలింపిక్స్ స్వర్ణ విజేత అర్షద్ నదీమ్.. ఉగ్ర లింకులు ఉన్నాయా?

పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన తరువాత అర్షద్ నదీమ్ పాకిస్థాన్ వెళ్లాడు. అక్కడ ఉగ్రవాద సంస్థ నేతలతో ఆయన సమావేశం అయ్యాడని ..

Arshad Nadeem : వివాదంలో పాక్ ఒలింపిక్స్ స్వర్ణ విజేత అర్షద్ నదీమ్.. ఉగ్ర లింకులు ఉన్నాయా?

Arshad Nadeem

Terrorist Leaders : పారిస్ ఒలింపిక్స్ 2024లో జావెలిన్ త్రోలో పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. నదీమ్ స్వర్ణ పతకం సాధించడంతో పాకిస్థాన్ లో ప్రజలు సంబురాలు చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అర్షద్ పై ప్రశంసల జల్లు కురిసింది. అర్షద్ స్వర్ణ పతకం సాధించడంపట్ల భారత్ కూడా అభినందనలు తెలిపింది. అయితే, ప్రస్తుతం ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అర్షద్ నదీమ్ కు ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. అర్షద్ స్వర్ణ పతకం గెలిచిన తరువాత ఓ ఉగ్రవాద సంస్థ సభ్యులతో భేటీ అయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి.. ఇందుకు సంబంధించి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Also Read : Neeraj Chopra – Nadeem : భారత్-పాక్‌ స్టార్లు.. మైదానంలో ప్ర‌త్య‌ర్థులు.. బయట దోస్తులు..

పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన తరువాత అర్షద్ నదీమ్ పాకిస్థాన్ వెళ్లాడు. అక్కడ ఉగ్రవాద సంస్థ నేతలతో ఆయన సమావేశం అయ్యాడని సోషల్ మీడియాలో కొందరు పేర్కొంటున్నారు. అయితే, ఈ భేటీ స్వర్ణ పతకం సాధించిన తరువాత జరిగిందా.. అంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మహ్మద్ హరీస్ దార్ అనే ఉగ్రవాదితో అర్షద్ భేటీ అయినట్లు ఉంది. హరీస్ దార్ నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా రాజకీయ ఫ్రంట్ అయిన మిల్లీ ముస్లీం లీగ్ (ఎంఎంఎల్) జాయింట్ సెక్రటరీ.

Also Read : పాక్ స్వ‌ర్ణ విజేత అర్షద్ నదీమ్‌కు అతని మామ ఏం బహుమతి ఇచ్చారో తెలుసా.. షాకవ్వాల్సిందే..!

పాకిస్థాన్‌లోని ల‌ష్క‌రే తోయిబా ఉగ్రవాద సంస్థ ఆర్థిక లావాదేవీల‌ను హారిస్ చూసుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఐక్యరాజ్య స‌మితి అత‌డిని అంత‌ర్జాతీయ ఉగ్రవాదిగా ఇదివరకే ప్రక‌టించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదేంటి క్రీడాకారుడితో ఉగ్రవాది కలవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరూ ఎప్పుడు కలిశారు.. అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై అర్షద్ నదీమ్ కానీ, పాకిస్థాన్ ప్రభుత్వం, పాకిస్థాన్ మీడియా ఎలాంటి ప్రకటన చేయకపోవటం గమనార్హం.