Pakistan player Saim Ayub rushed to hospital after freak injury in 2nd Test vs South
పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే పాకిస్థాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు సైమ్ అయూబ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో అతడి కుడికాలు చీలమండలానికి గాయమైంది.
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాక్ బౌలర్ మహ్మద్ అబ్బాస్ ఈ ఓవర్‌ను వేశాడు. ఓ బంతిని సఫారీ బ్యాటర్ రియాన్ రెకెల్టన్ షాట్ ఆడాడు. గల్లీ, బ్యాక్‌వర్డ్ పాయింట్ల మీదుగా బాల్ దూసుకుపోతుండగా ఫీల్డర్లు జమాల్, ఆయుబ్ లు దానిని ఆపే ప్రయత్నం చేశారు. బంతి జమాల్ చేజిక్కింది. ఆయూబ్ బ్యాలెన్స్ కోల్పోవడంతో అతడి కాలు మడిమ మెలిక పడింది.
IND vs AUS 5th Test : బుమ్రాతో కొన్‌స్టాస్ వాగ్వాదం.. 2 బంతుల తరువాత.. నిరాశతో డగౌట్‌కు..
దీంతో తీవ్రమైన నొప్పితో జమాల్ విలవిలలాడాడు. ఫిజియో వచ్చి ప్రాథమిక వైద్యం అందించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో అతడు మైదానాన్ని వీడాడు. అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. అతడి మడిమ విరిగినట్లుగా చెబుతున్నారు. అయితే.. అయూబ్ గాయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న అయూబ్ దూరం అయితే అది పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. గాయం తీవ్రత చాలా ఎక్కువ ఉంటే మాత్రం అది పాక్ ఛాంపియన్ ట్రోఫీ ఆశలపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
కాగా.. ఆయూబ్ మైదానాన్ని వీడడంతో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా అబ్దుల్లా షఫీక్ వచ్చాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 48 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్(105), టెంబా బవుమా (49)లు క్రీజులో ఉన్నారు.
AUS vs IND : సిడ్నీ టెస్టు.. తొలిరోజు ఆస్ట్రేలియాదే పైచేయి.. చివరిలో దిమ్మతిరిగే షాకిచ్చిన బుమ్రా
2023లో సైమ్ అయూబ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. ఆల్‌రౌండర్ అయిన ఆయూబ్ ఇప్పటి వరకు పాక్ తరుపున 27 టీ20లలో 498 పరుగులు, ఏడు టెస్టుల్లో 364 రన్స్ చేయడంతో పాటు నాలుగు వికెట్లు తీశాడు. ఇక వన్డేల్లో మాత్రం అదరగొడుతున్నాడు. 9 వన్డేల్లో 64.4 సగటుతో 515 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, ఓ అర్థశతకం ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు చేశాడు. పాకిస్థాన్ ఈ వన్డే సిరీస్ 3-0తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
— rohitkohlirocks@123@ (@21OneTwo34) January 3, 2025